జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెల (సెప్టెంబర్)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిందని ఆయన చెప్పారు. ఇది జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ దాని గూఢచార సంస్థ ISI కార్యకలాపాలను చాలా వరకు అరికట్టిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జమ్మూలోని బానా సింగ్ స్టేడియంలో పార్టీ నిర్వహించిన ‘ఏకాత్మ మహోత్సవ్’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగాన్ని పొడిగించడం ద్వారా పార్టీ తీసుకువచ్చిన మార్పులను చూసి ప్రజలు బీజేపీని అధికారంలోకి తెస్తారనే నమ్మకం ఉందని అన్నారు. జమ్మూ కశ్మీర్ లో పూర్తి మెజారిటీతో గెలుస్తామని తెలిపారు.
Read Also: Paris Olympics: చేతికి గాయం.. క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ ఓటమి