NTV Telugu Site icon

Ujjaini Mahankali Bonalu: బంగారు బోనంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు!

Kishan Reddy Ujjaini Mahakali Temple

Kishan Reddy Ujjaini Mahakali Temple

Union Minister Kishan Reddy Visits Secunderabad Ujjani Mahakali Temple: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని మహాకాళి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరుస్తోంది. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బంగారు బోనంతో ఆలయంకు చేరుకున్నారు.

Also Read: Ujjaini Mahankali Bonalu 2024: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి!

బంగారు బోనంతో అమ్మవారి ఆలయంకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కిషన్ రెడ్డి.. బంగారు బోనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘మన రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుండి బోనాల పండుగ సంప్రదాయం ఉంది. దేశంలో ఎక్కడా లేని బోనాల పండగ మనకు మాత్రమే ప్రత్యేకం. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు మరీ ప్రత్యేకం. అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

 

 

 

Show comments