Site icon NTV Telugu

Amit Sha Review: CRCSపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష

Amit

Amit

ఢిల్లీలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (CRCS) కార్యాలయం కంప్యూటరీకరణ పురోగతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. సీఆర్‌సీఎస్‌ కార్యాలయం ద్వారా నిర్వహించే పోటీల ద్వారా యువత కూడా పోర్టల్‌ను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని.. అంతేకాకుండా మెరుగైన అనలిటిక్స్‌లో భాగస్వాములు కావాలని అమిత్ షా తెలిపారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ అయిన ‘శేఖర్‌ సే సమృద్ధి’ని సాకారం చేసేందుకు సహకార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని అమిత్ షా పేర్కొన్నారు.

Read Also: Bhatti Vikramarka: బిఆర్ఎస్ ఆ రెండు జిల్లాల ప్రజలకు తీరని ద్రోహం చేసింది.. భట్టి విక్రమార్క ధ్వజం

మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 నిర్వహణకు బాధ్యత వహించే సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయం, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల కోసం డిజిటల్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడానికి కంప్యూటరైజ్ చేయబడుతోందని అమిత్ షా తెలిపారు. జూన్ 26 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ మరియు పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొత్త మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీల (ఎంఎస్‌సిఎస్) రిజిస్ట్రేషన్‌కు ఎంతో దోహదపడుతుందని.. ఇప్పటికే ఉన్న బహుళ-రాష్ట్ర సహకార సంఘాల పనిని సులభతరం చేస్తుందని షా తెలిపారు.

Exit mobile version