Keralam: కేరళ ఇకపై ‘కేరళం’.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్!

Kerala

Kerala

Keralam: కేరళ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. రాష్ట్రం పేరును అన్ని భాషల్లోనూ కేరళం”గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం ఉదయం కొత్తగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయం (సేవా తీర్థం)లో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కేరళ పేరు కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే అహ్మదాబాద్‌ మెట్రో ఫేజ్-2కు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో పాటు జబల్‌పూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే విద్యుత్‌ రంగంలో సంస్కరణలకు, దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు, 14 ఏళ్ల బాలికులకు ఉచితంగా గర్దాసిల్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

READ ALSO: మినీ LED, 108W సౌండ్‌, Quantum డాట్ టెక్నాలజీతో Kodak 65 అంగుళాల IconiK Google TV భారత్‌లో లాంచ్..!

అసలు పేరు మార్పు ఎందుకంటే..
మలయాళ భాషలో రాష్ట్రాన్ని ఇప్పటికే ‘కేరళం’ అని పిలుస్తారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లోనూ రాష్ట్రం పేరును కేరళం‌గా మార్చాలని కోరుతూ 2024లోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మలయాళీ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ పేరు మార్పు నిర్ణయం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

READ ALSO: NTR-Neel: రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ మాస్ సాంగ్? షూటింగ్ స్పీడ్ పెంచిన ప్రశాంత్ నీల్!