NTV Telugu Site icon

Union Budget 2023: క్లుప్తంగా కేంద్ర బడ్జెట్..అంకెల్లో ఇలా!

Sitae1

Sitae1

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2023-2024ను ప్రవేశపెట్టారు. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాల నడుమ ఈ బిల్ విడుదలైంది. దానికి తగ్గట్లే కొన్ని రంగాలకు భారీ ప్రాధాన్యత దక్కింది. కానీ మరికొన్ని సెక్టార్లకు మాత్రం నిరాశే మిగిలింది. ప్రతిసారి లాగే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ సమ్మరీని అంకెల్లో చూద్దాం.

87 నిమిషాలు: నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని గంట 27 నిమిషాల్లో ముగించారు. అంటే, సుమారు 87 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అత్యంత తక్కువ సమయం పాటు కొనసాగిన నిర్మల బడ్జెట్ ప్రసంగం ఇదే. 2020 లో అత్యధికంగా 162 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.

రూ. 2 లక్షల కోట్లు : అంత్యోదయ, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అమలు కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ. 2 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. ఈ పథకం జనవరి 1, 2023 నుంచి సంవత్సరం పాటు కొనసాగుతుంది.

రూ. 2200 కోట్లు: ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఇందులో విలువైన పళ్ల తోటల కోసం నాణ్యమైన, వ్యాధి నిరోధక ప్లాంటింగ్ మెటీరియల్‌ను అందజేస్తారు. ఇందుకు రూ. 2200 కోట్లను కేటాయించారు.

రూ. 20 లక్షల కోట్లు: వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచారు. ఇందులో పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

రూ. 6 వేల కోట్లు : ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా ఒక సబ్ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు.

38,800 : 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో రిక్రూట్ చేయనున్న టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ సంఖ్య.

రూ. 79000 : పీఎం ఆవాస్ యోజన కోసం.

రూ. 10 లక్షల కోట్లు : కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ఔట్ లే. ఇది జీడీపీలో సుమారు 3.3 %. అలాగే, 2019-20 ఔట్ లే కన్నా మూడు రెట్లు ఎక్కువ.

రూ. 13.7 లక్షల కోట్లు :కేంద్ర కేపిటల్ ఎక్స్ పెండిచర్. ఇది జీడీపీలో సుమారు 4.5%.

రూ. 2.40 లక్షల కోట్లు : రైల్వే శాఖకు కేటాయించిన బడ్జెట్.

50: దేశంలో ఈ ఆర్థిక సంవత్సరం నిర్మించనున్న ఏర్ పోర్ట్ లు, హెలీపోర్ట్ లు, వాటర్ ఏరోడ్రోమ్స్ సంఖ్య.

రూ. 7 వేల కోట్లు : న్యాయ శాఖలో ఈ కోర్ట్స్ ఫేజ్ 3 (E-Courts Phase-3) ప్రాజెక్ట్ కోసం.

157: దేశవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించనున్న నర్సింగ్ కళాశాలలు. వీటిని 2014 తరువాత ప్రారంభించిన 157 మెడికల్ కాలేజీల ప్రాంగణాల్లోనే ఏర్పాటు చేస్తారు.

Show comments