Underwear Raining :పొరుగు దేశం చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకో తెలియదు గానీ వింతలన్నీ ఆ దేశంలోనే జరుగుతాయి. అలాంటి కొత్త వింత సంఘటన మరొకటి జరిగింది. దేశంలో అండర్ వేర్ తుపాను ఏర్పడింది. దీనిని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. తుపాను కారణంగా భారీ మొత్తంలో లోదుస్తులు ఆకాశంలో ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న లోదుస్తులను చూసి అక్కడి ప్రజలు షాక్ అయి చూస్తుండిపోయారు. లోదుస్తుల తుఫాను వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కడ బలమైన గాలులకు ప్రజల బట్టలు ఎగిరిపోయాయి. సెప్టెంబర్ 2న ప్రజల లోదుస్తులు వారి బాల్కనీల నుండి ఎగిరిపోయాయి. ప్రస్తుతం చైనాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు వానలు పడాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఈసారి వర్షాలనికి బదులు ఆకాశం నుంచి లోదుస్తులు వానలా పడ్డాయి. ఈ వింత దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
xhs is so funny the top trending topic today is "chongqing lost its underwear" after a lvl 8 typhoon blasts thru the city 😹😹 pic.twitter.com/s3pMpZS53p
— 喵亮 nya🐈🌱 (@nya1iang) September 5, 2024
ఈ సంఘటన సెప్టెంబరు 2 న చైనాలోని చాంగ్‌కింగ్‌లో జరిగింది. తుఫాన్ కారణంగా గాలి వీచడం వల్ల అండర్ వేర్ కుప్పలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలో ఎండల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వేడి వాతావరణం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అధికారులు కృత్రిమ వర్షాలు కురిపించాలని అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలోనే ఈదురు గాలులు వీచడంతో ఇళ్లలోని బాల్కనీలో ఆరబెట్టేందుకు ప్రజలు ఉంచిన బట్టలు, బరువైన లోదుస్తులు ఎగిరిపోయాయి. అండర్ వేర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆకాశంలో లోదుస్తులు మాత్రమే కనిపించాయి. దీని తర్వాత, చైనా ప్రజలు ఈ సంఘటనకు “9/2 చాంగ్‌కింగ్ అండర్‌వేర్ సంక్షోభం’ అని పేరు పెట్టారు. తుపాను క్లౌడ్ సీడింగ్ వల్ల సంభవించలేదని, సహజసిద్ధంగా సంభవించిందని ఘటన అనంతరం అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో NoToEvils అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఈదురుగాలుల కారణంగా ఎక్కడ చూసినా అండర్ వేర్లు ఎగిరిపోతున్నాయి. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఫుల్ షాక్ అవుతున్నారు.
Chongqing's cloud-seeding to end a heatwave led to the "9/2 underwear crisis" as a windstorm scattered laundry across the city. With gusts up to 76 mph, bras and pants flew through the streets. Officials say the storm was natural, not caused by cloud-seeding. #Chongqing pic.twitter.com/pmKrvWOZSj
— NTE (@NoToEvils) September 9, 2024
చైనాలోని నైరుతి ప్రాంతంలో తీవ్రమైన వేడి ఉంది. దీని కారణంగా ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఎండ వేడిమి కారణంగా ఆ ప్రాంతంలోని పాఠశాలలు మూతపడ్డాయి. వేడిని ఎదుర్కోవడానికి, అధికారులు కృత్రిమ వర్షపాతాన్ని కురిపించారు. ఇది మేఘాలలో సిల్వర్ అయోడైడ్ వంటి రసాయనాలను వ్యాప్తి చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని ప్రేరేపిస్తుంది. దాదాపు 200 క్లౌడ్ సోవింగ్ రాకెట్‌లను ప్రయోగించామని అధికారులు చెబుతున్నారు. ఉష్ణప్రసరణ వల్ల గాలులు వీస్తున్నాయని చాంగ్‌కింగ్ వాతావరణ పరిశీలన కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ యిక్సువాన్ తెలిపారు.