NTV Telugu Site icon

Vundavalli Aruna Kumar: ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది

Undavalli

Undavalli

Undavalli Arun Kumar: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ఫలితాలతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ పొత్తు లేకపోయినా రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేకపోవును.. కూటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టం జరిగేది అని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు.

Read Also: T20 World Cup: అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్.. యూఎస్ విదేశాంగ ప్రతినిధి ఏమన్నారంటే..

ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. అలాగే, 11 స్థానాలే గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి పోరాడాలి.. ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయి.. కరుణానిధికి ఏడు స్థానాలు వచ్చిన, జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమైన.. సక్రమంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించి మళ్లీ అధికారంలోకి వచ్చారు అని గుర్తు చేశారు. ఇక, ఉల్లిపాయదారి పెరిగి ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయింది.. ఆంధ్ర రాష్ట్రంలో మధ్యం ధరలు పెరుగుదలే వైసీపీ ఓటమికి కారణమయ్యాయి.. ఈవీఎంలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని ఉండవల్లి అన్నారు.

Read Also: Xiaomi 14 Civi Price: భారత్‌లో ‘షావోమీ’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌.. ధర, ఫీచర్స్ ఇవే!

కాగా, ప్రస్తుతం కోర్టులో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కేసు ప్రభుత్వం తరఫున కొనసాగించండి అని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై పార్లమెంటు తొలి సమావేశంలోనే నోటీస్ ఇచ్చి చర్చ పెట్టండి అని సూచించారు. అలాగే, వైఎస్ జగన్ కు సైతం ఉండవల్లి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ లేదు.. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని పటిష్టపర్చకోండి.. ఇక, వైసీపీ పని అయిపోయింది అనుకుంటే పొరపాటే.. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కోర్టుకెళ్లండి అని తెలిపారు. ఇక, ఎన్డీఏకు, ఇండియా కూటమికి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

Read Also: Jharkhand Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం .. లారీ ఆటో ఢీ.. ఐదుగురు మృతి

అలాగే, అవినీతికి పాల్పడిన రాజకీయనేతలను అరెస్టు చేయవద్దు.. అవినీతికి పాల్పడితే ఆ నాయకుడు ఆస్తులను జప్తు చేయండి అని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సినవి చాలా ఉన్నాయి.. ఇప్పుడు మోడీ అహంకారం తగ్గింది.. జగన్ కు 11 సీట్లు వచ్చినా చాప్టర్ క్లోజ్ అయినట్లు కాదు.. 2019లో టీడీపీకి వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు వైసీపీకి ఎక్కువ వచ్చాయన్నారు. చంద్రబాబు కసితో పని చేసి మళ్లీ అధికారంలోకి వచ్చారు.. జగన్ ఓటమికి కారణం కక్ష రాజకీయాలు.. జగన్ కక్ష రాజకీయాలు చూసి మిడిల్ క్లాస్ ప్రజలు దూరం అయ్యారు.. అలాగే, లిక్కర్ అధిక రేట్ల కారణంగా పేద వర్గాలు జగన్ ను దూరం పెట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.