రెండు గ్రామాల క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఘర్షణ జరిగింది. నో బాల్ సిగ్నల్ ఇచ్చినందుకు అంపైర్ ను కొట్టి కత్తితో పొడిచి చంపారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం శంకర్ పూర్, బెర్హంపూర్ కు సందర్భంగా అండర్ -18 క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
Read Also : Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..
మహిలాంద ప్రాంతానికి చెందిన 22 సంవత్సరాల లక్కీ రౌడ్.. అంపైర్ గా వ్యవహారించాడు. అయితే మ్యాచ్ సందర్భంగా ఒకరు బౌలింగ్ చేయగా అంపైర్ గా ఉన్న లక్కీ రౌత్ నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఇది గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అంపైర్ లక్కీ రౌడ్ ప్లయర్ జగ్ రౌత్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్ రౌత్ తన సోదరుడు మునా రౌత్ ను పిలిపించాడు. అక్కడకు వచ్చిన అతడు ఆగ్రహంతో లక్కీ రౌత్ ను కొట్టాడు. నో బాల్ సిగ్నల్ ఇచ్చిన ఆ అంపైర్ ను కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
Read Also : Donald Trump : నేడు కోర్టుకు డొనాల్డ్ ట్రంప్
కాగా.. తీవ్రంగా గాయపడిన లక్కీ రౌత్ ను ఎస్సీబీ వైద్య కాలేజీ హాస్పటల్ కు తరలించారు. అయితే ఆ యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్కీ రౌత్ చనిపోయిన వార్త తెలియడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులను గ్రామస్థులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
