Site icon NTV Telugu

Umair Sandhu: వేశ్యలతో పడుకున్న స్టార్ హీరో.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లవర్

Umair Sandhu Tweet On Ananya Panday

Umair Sandhu Tweet On Ananya Panday

Umair Sandhu: ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే పాకిస్తాన్ కు చెందిన ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరీ రెచ్చిపోతున్నాడు. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ సినీ సెలబ్రిటీలపై ట్వీట్స్ చేస్తూ సంచలనాలకు తెరలేపుతున్నాడు. కేవలం ఆయన ఇండియన్ యాక్టర్స్‌నే టార్గెట్ చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ఉమైర్ సంధు.. సోషల్ మీడియాలో ఇటీవల ట్వీట్లతో గబ్బు లేపుతున్నాడు. ప్రతి ఒక్కరివి ఎప్పుడూ ఏదో ఇష్యూ బయటకు తీస్తూ వాటిని జనాలు చర్చించుకునేలా సంచలనాలు సృష్టిస్తున్నాడు. అంతకుముందు సినిమాల విడుదల సమయంలో రివ్యూస్ ఇచ్చే ఇతగాడు.. ఇప్పుడు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ను టచ్ చేస్తున్నాడు.

Read Also:CM YS Jagan: ఉద్యోగుల సంతోషం, భవిష్యత్తు నా బాధ్యత.. నిజాయితీతో అడుగులేశాం

ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో పై దారుణమైన పోస్ట్ పెట్టాడు ఉమైర్ సంధు. ఇక గత కొంతకాలంగా బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్‌ కపూర్, అనన్య పాండే పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇటీవల వీరిద్దరు కలిసి ట్రిప్ కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వార్తలు నిజమేనేమో అని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఈ మధ్య లవ్ బర్డ్స్ గా ఎంజాయ్ చేస్తున్న ఆదిత్యా రాయ్ కపూర్ లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి దారుణమైన కామెంట్ చేశాడు.

Read Also:Sonia Gandhi: రాజీవ్‌ గాంధీ జీవితం దారుణంగా ముగిసింది.. తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారు

‘ఆదిత్య సెక్స్ అడిక్టెడ్’ అని అనన్య తన క్షోజ్ ఫ్రెండ్స్ కు చెప్పిందట. స్పెయిన్ లో ప్రాస్టిట్యూట్స్ తో పడుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా తెలిపింది. బార్సిలోనాలో అతను నైట్ గర్ల్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చిందని ఉమైర్ సంధు తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో నెటిజ‌న్స్ ఉమైర్ సంధుపై మండిపడుతున్నారు. నీకు ఇలాంటి పుకార్లు పుట్టించి అందరితో తిట్టించుకోవడానికి సిగ్గుగా లేదా..? ఎదుటివారిపై ఇలాంటి తప్పుడు వార్తలు ఎప్పుడూ రాయడమే నీపనా ? ఇలాంటి ట్వీట్స్ చేయడం మానుకోవాలని అంటూ ఘాటుగా చెప్పుతో కొట్టినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version