NTV Telugu Site icon

Uma Reddy: మానవత్వం చాటుకున్న సిద్దిపేట ఏఎస్ఐ ఉమా రెడ్డి..

Whatsapp Image 2024 04 18 At 10.52.14 Am

Whatsapp Image 2024 04 18 At 10.52.14 Am

పరిస్థితులు ఏమైనా సరే కొంతమంది ఈ మధ్య కాలంలో క్షణికవేశంలో వారి తనువు చాలిస్తున్నారు. స్కూల్లో టీచర్ కొట్టిందని, లేక ప్రేమలో మోసపోయారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారి కుటుంబ సభ్యులు వారిని కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు రోడ్డు పాలవుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..

Also read: Cyber Attack : న్యూయార్క్‌లోని స్టేట్ డ్రాఫ్టింగ్ బిల్లు కార్యాలయంపై సైబర్ దాడి

సిద్దిపేట నగరంలోని రేణుక నగర్ లో ఓ బావిలో ప్రమాదవశాత్తు వ్యక్తి పడి మృతి చెందాడు. కనకయ్య అనే యువకుడు బావిలో పడి మృతి చెందిన మరుసటి రోజు ఆ వార్త బయటకు రావడంతో వారి కుటుంబ సభ్యులను శోఖసందరంలోకి నెట్టేసింది. ఇక బావిలో పడ్డ మృతదేహాన్ని బయటకు తీయాలంటే ఆ ప్రాంతంలోని గజ ఈతగాళ్లు సదరు మృతుడి కుటుంబాన్ని 25 వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా అడిగారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు అంత డబ్బు ఇవ్వలేమని చెప్పడంతో గజఈతగాళ్ళు బావిలోని బాడీని బయటికి తీయకుండానే వెళ్ళిపోయారు. ఇకపోతే విషయం ఇలా ఉండగా..

Also read: Bethi Subash Reddy: నేను ఈటలకు మద్దతు ఇస్తా.. బీఆర్ఎస్ కు భేతి సుభాష్ రెడ్డి గుడ్ బై..

అక్కడి పరిస్థితి తెలుసుకున్న సిద్దిపేట ఏఎస్ఐ ఉమారెడ్డి తన మానవతాన్ని చాటుకున్నారు. గజ ఈతగాళ్లు చేయాల్సిన పనిని ఉమా రెడ్డి ఎంతో సాహసంతో బావిలోకి దూకి మృతుడి మృతదేహాన్ని బయటకి తీసుకోవచ్చాడు. దాంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నవారు ఏఎస్ఐ చేసిన పనికి ధన్యవాదాలు తెలిపారు. ఇక మృతుడి మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.