Thiruvananthapuram: F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thiruvananthapuram: కేరళలోని త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అర్ధరాత్రి బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక F-35B లైట్‌నింగ్ II యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం సంచలనంగా మారింది. ఇండియన్ ఓషన్‌పై మిషన్ లో ఉండగా, విమానం ఇంధనం తక్కువ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ F-35B యుద్ధ విమానం బ్రిటన్‌కు చెందిన HMS Prince of Wales క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఈ వాహక నౌకా సమూహం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లలో పాల్గొంటోంది. ఇటీవలే భారత నౌకాదళంతో సంయుక్త సముద్ర విన్యాసాలు పూర్తి చేసిన ఈ దళం, భారత సముద్ర ప్రాంతంలో టూరింగ్ చేస్తోంది.
Read Also: Ahmedabad plane crash: బోయింగ్ 787 నిర్వహణలో తమ ప్రమేయం లేదు.. టర్కీ స్పష్టికరణ..!
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
F-35B మోడల్ ప్రత్యేకంగా షార్ట్ టేక్-ఆఫ్, వెర్టికల్ ల్యాండింగ్ (STOVL) సామర్థ్యంతో రూపొందించబడింది. ఇవి క్యాటపుల్ట్ లేని వాహక నౌకల మీద కూడా ల్యాండ్ కావచ్చు. అయినా సరే, ఈ ఘటనలో విమానం ఎందుకు HMS Prince of Walesపై ల్యాండ్ చేయలేకపోయిందనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం ప్రకారం, వాహక నౌక వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అక్కడ ల్యాండింగ్ సాధ్యపడకపోయి ఉండవచ్చని అంటున్నారు.
F-35 ప్రోగ్రామ్‌ను అమెరికాకు చెందిన డిఫెన్స్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ మల్టీ-రోల్ యుద్ధ విమానాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. స్టెల్త్ లక్షణాలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, డేటా షేరింగ్ వ్యవస్థ వంటి అధునాతన సాంకేతికతలతో ఇది US, UK, ఇజ్రాయెల్, NATO దేశాల వాయుసేనలకు ప్రధానంగా ఉపయోగపడుతోంది. తాజా సమాచారం ప్రకారం విమానాన్ని భద్రంగా త్రివేంద్రం విమానాశ్రయ పరిధిలో పార్క్ చేశారు. ఏ ప్రాణనష్టం లేకుండా ఈ ఘటన ముగియడంతో రక్షణ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై బ్రిటన్, భారత రక్షణశాఖలు సమగ్ర సమాచారం సేకరిస్తున్నాయి.
తాజావార్తలు
-
US Iran Talks: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌తో మరోసారి చర్చలకు సిద్ధం
-
Viswanath & Sons: ‘అల వైకుంఠపురములో’ రేంజ్ హిట్.. సూర్య సినిమాపై నాగవంశీ బోల్డ్ స్టేట్మెంట్!
-
Pakistan Blast: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!