Russia – Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించింది దాదాపు ఏడాది కావోస్తున్నా ఇంత వరకు ఏ దేశం వెనకాడడం లేదు. ఎలాగైనా శత్రుదేశాన్ని స్వాధీనం చేసుకునేంతవరకు తగ్గేదేలే అన్నట్లు దాడులను కొనసాగిస్తోంది రష్యా. ఈ దాడుల్లో దేశంలో సర్వం కోల్పోతున్న ఆఖరి వరకు పోరాడుతామని ఉక్రెయిన్ తొడలు కొడుతోంది. ఇటీవలే రష్యా 120క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఆ తెల్లారే మళ్లీ ఆ దేశ రాజధాని కీవ్ పై రష్యా 16డ్రోన్లతో దాడికి యత్నించింది. వీటన్నింటినీ నాశనం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది.
Read Also: Covid Guidelines: ఆ దేశాల నుంచి వచ్చేవారి కోసం తాజా కొవిడ్ మార్గదర్శకాలివే..
యుద్ధంలో అతలాకుతలమైన దేశంపై రష్యా క్షిపణుల దాడిని ప్రయోగించిన ఒక రోజు తర్వాత, రాజధాని కైవ్‌తో సహా దేశంపై రాత్రిపూట డ్రోన్ దాడిని తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం శుక్రవారం తెలిపింది. శత్రుదేశాలుగా భావిస్తోన్న ఇరాన్ తయారు చేసిన కమికేజ్ డ్రోన్‌లతో దాడిచేశారని ఉక్రెయిన్ వైమానిక దళం సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసింది. ఆగ్నేయ, ఉత్తర దిశల నుండి మొత్తం 16 డ్రోన్లు ప్రయోగించగా వాటిని నాశనం చేశామని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:12 గంటలకు దాడులు మొదలుపెట్టగా వాటిని రెండు గంటల పాటు పోరాడి ఎదుర్కొన్నట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
Read Also:Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్ తన ‘రాణి’ ఎవరో చెప్పాడా?
నగర మేయర్ విటాలి క్లిట్ష్కో మాట్లాడుతూ రాజధానిపై ఏడు డ్రోన్‌లతో దాడి చేశామని.. ఈ దాడుల్లో ఏడుగురు మరణించినట్లు తెలిపారు. గురువారం ఉదయం, రష్యా చేసిన దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దాడులను తిప్పికొట్టడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించామని, రష్యా తమ దేశంపై 69 మిస్సైళ్లను ప్రయోగించగా, వాటిలో తాము 54 మిస్సైళ్లను కూల్చేశామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. కాగా, రష్యా 120 క్షిపణులను ప్రయోగించిందని అంతకుముందు ఉక్రెయిన్ తెలిపింది.