NTV Telugu Site icon

Touching Vehicles: ఓ వ్యక్తిపై 5 ఏళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధం.. ఎందుకో తెలుసా?

Touching Vehicles

Touching Vehicles

Banned From Touching Vehicles: యూకేకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధించబడ్డాడు. వాహనాలను ముట్టుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? దానికి కూడా కారణం లేకపోలేదు. 29 సంవత్సరాల నేరచరిత్ర కలిగిన నేరస్థుడు ఎలాంటి వాహనాలను తాకకుండా నిషేధించబడ్డాడు. కేంబ్రిడ్జ్‌షైర్‌లోని పెన్నింగ్‌టన్‌కు చెందిన పాల్ ప్రీస్ట్లీ (44) కారు డోర్లు తెరవడానికి ప్రయత్నించి కెమెరాకు చిక్కాడు.

మార్చి 25, మార్చి 26 తేదీలలో మూడు సందర్భాల్లో, అతను ఆర్టన్ నార్త్‌గేట్‌లోని సెవెనాకర్స్, ఓర్టన్ బ్రింబుల్స్, కిల్‌బ్రైడ్, కెల్‌బర్న్‌లలోని వాహనాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం సీసీటీవీలో కనిపించింది. అనంతరం అతడిని అరెస్టు చేయగా తాళం, కత్తి, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.వందలాది దొంగతనాలకు సంబంధించిన నేరాలను కలిగి ఉన్న ప్రీస్ట్లీ.. ఇప్పుడు యజమాని అనుమతి లేకుండా వాహనాన్ని తాకకూడదని లేదా ప్రవేశించవద్దని ఆదేశించబడింది. అతను బుధవారం పీటర్‌బరో మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు అయ్యాడు, అక్కడ అతను మోటారు వాహనంతో జోక్యం చేసుకోవడం, గంజాయిని కలిగి ఉండటం, బహిరంగ ప్రదేశంలో కత్తిని కలిగి ఉండటం వంటి మూడు నేరాలను అంగీకరించాడు.

Read Also: Cruel Father: ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య.. అడ్డొచ్చిన భార్య, కోడలిపై..

ఈ సంఘటనలను పరిశోధించిన పీసీ ఒలివియా సియానీ ఇలా అన్నారు. ‘ప్రీస్ట్లీ గత ఏడాది జూన్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. అతని సీబీవో గడువు ముగిసే వరకు ఉత్తమ ప్రవర్తనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అతను కార్ల డోర్ హ్యాండిల్‌లను తెరిచేందుకు ప్రయత్నించి.. డోర్‌ తెరచుకోగానే కారులోని వస్తువులను ఎత్తుకెళ్లి అమ్మేస్తాడు.’ అని తెలిపారు. అతనికి తన కారు డోర్ హ్యాండిల్ అబ్సెషన్ కారణంగా ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. 2018లో అతను ఐదేళ్లపాటు అనుమతి లేకుండా కార్లను తాకవద్దని లేదా ప్రవేశించడం నిషేధించబడింది. అయితే, నిషేధం ముగియడంతో, అతను మళ్లీ నేరం చేశాడు. ఈసారి, అతని నిషేధం 2027 వరకు అమలులో ఉంది.