Bad police : పోలీసులంటే ప్రజలను కాపాడే రక్షకులు.. కానీ వీడో నీచుడు.. చేసేవన్నీ దారుణమైన నేరాలు. కరడు కట్టిన నేరాలకు కేరాఫ్ అడ్రస్ వీడు. ఏకంగా 12మంది మహిళలపై అత్యాచారాలు చేశాడు. వీడిపై 71లైంగిక నేరాలు పాల్పడినట్లు రుజువులున్నాయి. దీంతో లండన్ కోర్టు వీడికి ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ‘బాబీ చీమా గ్రమ్’ భారతీయ సంతతి వ్యక్తి. పూర్తి వివరాలు.. బ్రిటన్‌లోని అతిపెద్ద పోలీసు దళమైన మెట్‌లో పనిచేసిన 48 ఏళ్ల డేవిడ్ కారిక్ 2003 నుంచి 2020 వరకు 12 మంది మహిళలపై అత్యాచారం చేసి..వారిని అత్యంత క్రూరంగా హింసించాడు. మహిళలపై లైంగికదాడుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి సమాజంలో జీవించడానికి అర్హుడు కాదని.. న్యాయమూర్తి తీర్పు ఇచ్చే సమయంలో వ్యాఖ్యానించారు.
Read Also: Dhruva Natchathiram: ఈ సినిమా చూడకుండానే పోతామనుకున్నాం.. చివరికి వచ్చేస్తోంది
కారిక్ మొత్తంగా 48 అత్యాచారాలు సహా 71 లైంగిక నేరాలకు పాల్పడినట్లు రుజువైంది. దీంతో మహిళల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించిన వ్యక్తికి 36 జీవిత కాల కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు లండన్ లోని సౌత్ వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి.. ఈ నేరాలన్నీ రుజువులతో సహా నిరూపించబడటంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. దోషికి ఏకంగా 36 యావజ్జీవ కారాగార శిక్షలు విధిస్తూ తీర్పునిచ్చారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో ఇక కారిక తన జీవితం అంతా జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఒకవేళ పెరోల్ కావాలంటే 30 ఏళ్లు జైలు జీవితం గడిపిన తర్వాతే అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు.