A man With 12 Wives: ఓ వ్యక్తి ఒకట్రెండు కాదు ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. క్రికెట్ టీం కంటే ఓ ఎక్స్‌ట్రా ప్రేయర్ అదనంగా ఉన్నట్లు 12 మందిని మనువాడాడు. పిల్లలను కూడా పదుల సంఖ్యలో కాదు.. సెంచరీని దాటి దూసుకుపోతున్న పిల్లల సంఖ్యతో అతని గురించి తెలుసుకున్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు తాత అయ్యాడు. ఈ 12 మంది భార్యలతో అతనికి 102 మంది పిల్లలు ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడిక వారిని పోషించలేకపోతున్నానని.. పిల్లలు వద్దు బాబోయ్ అంటూ చేతులెత్తేస్తున్నాడు. ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన ఆ పెద్దమనిషి పేరు మూసా హసస్య. మరి ఆ ఘనుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్లక తప్పదండోయ్.
తూర్పు ఉగాండాకు చెందిన ముసా హసస్య కసేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు. 17 ఏళ్ల వయసులో 1972లో తొలి వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన ఏడాదికి తొలికాన్పులో సాండ్రా నాబ్వైర్ జన్మించింది. అయితే ఒక భార్యతో సుఖంగా ఉన్న అతనికి.. వంశాభివృద్ధి కోసం మరిన్ని వివాహాలు చేసుకోవాలని సోదరుడు, బంధువులు సూచించారు. వారి మాట నమ్మిన హసస్య.. ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. ఈ పిల్లలకు కూడా వివాహాలు అయ్యాయి. 578 మంది మనవళ్లు, మనవరాళ్లకు హసస్య తాత అయ్యాడు. వారి కుటుంబమే ఓ గ్రామమంతా అయ్యింది.
New Scheme : ఆమ్మాయి పుడితే ఐదువేలు.. సర్పంచ్ ను పొగుడుతున్న జనం
ఇంతమంది పిల్లలు ఉన్నారని అతను ధనవంతుడు అనుకుంటే పొరపాటే. ఇంతకీ అతనికి ఉన్న ఆస్తిపాస్తులు ఎంత అంటే.. కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే. ఈ 102 మంది పిల్లలు, 12 మంది భార్యలు, అతనికి.. మొత్తం ఆ రెండు ఎకరాల భూమి ఆధారం. ఈ చిన్న ఆస్తితో అతను ఇంతమందికి దుస్తులు, సరిపోయేంత ఆహారం సంపాదించలేకపోతున్నాడు. తిండి పట్టా సరిగా లేకపోవడంతో ఇద్దరు భార్యలు ఇటీవలే విసుగు చెంది ముసాను విడిచిపెట్టి వెళ్లిపోయారు. హసస్య చిన్న భార్య వయసు 35 ఏళ్లు కాగా, అతనికి కలిగిన సంతానంలో 10 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు. వందలాది పిల్లల్లో చాలా మంది పిల్లల పేర్లు కూడా హసస్యకు తెలియదు. పిల్లలను గుర్తించడంతో భార్యల సహాయం తీసుకుంటున్నాడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటేనే ఇళ్లు సందడిగా ఉంటుంది. అలాంటిది 102 మంది పిల్లలు.. అది రకరాకాల వయసు వారు ఉంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.