తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా, తెలుగు అసొసియేషన-యూఏఈ వారు దుబాయిలోని “దుబాయి హైట్స్ అకాడెమ” లో మార్ 18న సాయంత్రం “ఉగాది ఉతసవాలు” ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన తరఫున కల్చరల్ డైరెక్టర్ శీ వక్కలగడ్డ వంకట సురేష గారి ఆధ్వర్యంలో ప్రముఖ యాంకర్ రవి, ఉష, శరణ్య సంధానకర్తలుగా వ్యవహరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలుగుసినీ పరిశ్రమ నుంచి ప్రముఖ సంగీత దర్శకురాలు శ్రీమతి ఎంఎం శ్రీలేఖ, ప్రముఖ కథా నాయిక శ్రీమతి కామ్నా జెఠ్మలాని, సినీ నిర్మాత రాజశేఖర్ వర్మ ప్రముఖ న్యాయమూర్తి మాధవ రావు పట్నాయక్ విచ్చేశారు.
గజల్ వినోద్ అమ్మ తత్వం మీద, సెల్ ఫోన్ అంశంపై, తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలపై ఆలపించిన గజల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంఎం శ్రీలేఖ పాతిక సంవత్సరాల తన సినీ సంగీత ప్రస్థాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మొదలుపెట్టిన ప్రపంచ పర్యటన 25 దేశాలతో జరుపుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ పర్యటనలో దుబాయ్ లో పర్యటించడం ఎంతో అనందానుభూతులను కలుగుజేసినట్లు తెలిపారు.
ఎంంఎ శ్రీలేఖ, ఇతర గాయనీమణులు మౌతిక యాదవ్, గాయకులు రవి, గజల్ వినోద్ లతో కలిసి ఆలపించిన బహుల ప్రజాదరణ పొందిన సినీ మధుర గీతలు ఆడిటోరియంలోని ప్రేక్షేకులందరినీ ఉర్రూతలూగించాయి. మిమిక్రీ కళాకారుడు రాజు ప్రదర్శించిన సినీ/రాజకీయ ప్రముఖల అనుకరణ అందరినీ నవ్వుల్లో ఓలలాడించింది. మిమిక్రీ రాజు 8 నిమిసాల నిడివి వున్న సినీ సన్నివేశాల మాలికని ప్రదర్శిస్తూ, అందులో కనిపించిన 50 మంది గత/నేటి తరాల ప్రముఖ సినీ నటులను అనుకరించటం ఆహూతలందరినీ మంత్రముగ్ధులను చేసింది. మిమిక్రి రాజు మొట్టమొదటి సారిగా ఇటువంటి ప్రయత్నం చేయటం, సఫలీకృతం అవటం ఎంతో తృప్తినిచ్చినట్లు తెలిపారు.
తెలుగు అసోసియేషన్ తరుపున జనరల్ సెక్రటరీ శ్రీ వివేకాంద్ బలుస ప్రసంగించారు. సేవ, సంస్కృతి, సమైత్యత అనే మూడు మూల స్థంబాలపై స్థాపించిన తెలుగు అసోషియేషన్ అతి తక్కువ కాలంలో 25కి పైగా కార్యక్రమాలను యూఏఈలోని వివిధ ఎమిరేట్స్ లో విజయవంతంగా నిర్వహించటం గురంచి వివరించారు.
యాంకర్ రవి తన చతుర సంభాషణలతో సమయోచిత హాస్యంతో కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదంగా నిర్వహించి అందరి ప్రశంసలని పొందాడు. స్పాన్సర్లు, దాతల పూర్తి సహాయ సహకారములతో ఉగాది ఉత్సవాలు ఘన విజయంపొందాయి. తెలుగు నూత సంవత్సరాది తోటి తెలుగు వారితో కలిసి జరుపొనుటకు వచ్చిన సుమారు 1000 మందితో దుబాయ్ హైట్స్ కిక్కెరిసిపోయింది.
యూఏఈలోని వివిధ ఎమిరేట్స్(దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా) నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారి, యువ బృందములు చేసిన సంప్రదాయ, సినీ నృత్యప్రదర్శనలతో అందరినీ ఆకర్షించారు. వ్యవస్థాపక సభ్యులు& బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంగీత దర్శకురాలు శ్రీమతి ఎంఎం శ్రీలేఖని, కథానాయిక కామ్నా జెఠ్మాలాని, వేడుకల్లో ప్రదర్శన ఇచ్చిన కళాకారులందరికీ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఇదే విధంగా తమ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న యూఏఈ స్థానిక చిన్నారులందరికీ ప్రశంసాపత్రాలను బహూకరించారు.
ఉగాది ఉత్సవాల కర్యాక్రమం ఘనంగా జరుపుటకు సంపూర్ణ సహకారమందించిన స్పాన్సర్లు, సెయింట్ మార్టినస్ యూనివర్సిటీ, యూఎన్ఏ, హై గేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ స్యాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ ఫ్రా, బిర్యానీస్$ కో, ట్రాన్స్ ఏషియో, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, సూపర్ జెట్ టూర్స్, ఫార్చ్యూన్ ఇన్, మై దుబాయ్, ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటెల్స్, ఇన్వెస్టర్ గ్రీవ్స్ ప్రైవేట్ లిమిటెడ్. గురు ప్రొడక్షన్స్, రవి మెలోడిస్, స్పాన్సర్లు అందరినీ తెలుగు అసోసియేషన్ తరుపున శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు దినేష్ కుమార్ ఉగ్గిన, ఉపాధ్యక్షుడు మసిఉద్దీన్, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, కల్చరల్ డైరెక్టర్ వెంకట సురేష్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్ డైరెక్టర్ సురేంద్ర ధనేకుల, ఫైనాన్స్ డైరెక్టర్ మురళీ కృష్ణ నూకల, కమ్యూనిటీ సర్వీఎస్ డైరెక్టర్ సాయి ప్రకాశ్ సుంకు, కమ్యూనిటీ డైరెక్టర్ రవి ఉట్నూరి, మార్కెటింగ్ డైరెక్టర్ అంబేద్కర్, లీగల్ డైరెక్టర్ శ్రీధర్ దామర్ల కార్యక్రమానికి విచ్చేశారు. ఆంధ్ర కళావేదిక, ఖతార్ నుంచి వచ్చిన విక్రమ్ సుఖవాసీ శ్రీలేఖ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. తెలుగు అసోసియేషన్ తరుపున వర్కింగ్ కమిటీల సభ్యులు ఫ్లోరెన్ విమల, సౌజన్య, విజయభాస్కర్, ఫహీమ్, మోహన కృష్ణ, శరత్ చంద్ర, భీం శంకర్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతులు చూసుకున్నారు.