Uddhav Thackeray: ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. మ్యాచ్‌ను వీక్షించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. థాకరే ప్రకటన రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇంతలో, ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. శివసేన (యూబీటీ) మొదటి నుంచి భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తూనే ఉంది.
అయితే.. తాజాగా ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ మాట్లాడుతూ.. “నేను దేశ భక్తుడిని. అందుకే ఆ మ్యాచ్‌ను చూడలేదు. ఆ మ్యాచ్‌ను చూసిన వారందరూ దేశద్రోహులు. దేశభక్తి కేవలం ఆట చూడటానికి మాత్రమే పరిమితం కాదు. నిజమైన దేశభక్తి జాతీయ ప్రయోజనాల విషయాలను తెలుసుకోవడం, సరైన సమయంలో చురుగ్గా ఉండటంలో ఉంటుంది” అని అన్నారు.
READ MORE: Tragedy in Kakinada: ప్రియురాలు దారుణ హత్య.. ట్రైన్ కింద పడి యువకుడు సూసైడ్
ఇటీవల ముగిసిన 2025 ఆసియా కప్ ట్రోఫీ చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగింది. టైటిల్ గెలుచుకున్న టీం ఇండియా మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫిని ఎత్తుకెళ్లారు. నఖ్వీ బాధ్యతారహిత చర్య వల్ల క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అయితే.. ఆయనకు గుణపాఠం చెప్పాలని బీసీసీఐ దృఢంగా నిశ్చయించుకుంది. ట్రోఫీ వివాదంపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, ట్రోఫీని తమకు తిరిగి ఇవ్వాలని బీసీసీఐ పేర్కొంది. లేకపోతే.. నేరుగా ఏసీసీ కార్యాలయం నుంచి తీసుకుంటామని చెప్పింది. తాజాగా ACC అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేశారు.
