రంజాన్ పండుగను (Ramzan) పురస్కరించుకుని యూఏఈ ప్రభుత్వ పెద్దలు విదేశీ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. మంచి ప్రవర్తన కలిగిన 1,049 మంది ఖైదీల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ (UAE leaders) ఇచ్చారు. దీంతో ఖైదీలు, వారి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.
రంజాన్ సందర్భంగా 1,049 మంది ఖైదీలకు (1,049 prisoners) క్షమాభిక్ష ప్రసాదిస్తూ యూఏఈ నేతలు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామిక్ సంప్రదాయ ప్రకారం ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ మంచి ప్రవర్తన కలిగినవారికి మరో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
2023లో కూడా UAE నాయకులు 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా రంజాన్‌కు ముందు 3,400 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. తాజాగా 2024 సంవత్సరంలో మరికొంత మంది ఖైదీలకు క్షమాభిక్ష పెడుతూ వారి కుటుంబాల్లో పండుగ సంతోషాన్ని కల్పించారు.
ఇదిలా ఉంటే రంజాన్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తు్న్న ఉద్యోగులకు పని సమయాలు తగ్గించారు. రెండు గంటల పాటు సమయాన్ని కుదిస్తూ యూఏఈ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆయా సందర్భాలను బట్టి షిఫ్ట్‌లు అమలవుతాయి.
