NTV Telugu Site icon

Electricity : యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్ల అద్భుతం..ఖర్జూరంతో విద్యుత్

New Project (35)

New Project (35)

Electricity : నాచురల్ స్వీట్ పండులో కర్జూరం ఒకటి. ఖర్జూర పండ్లు ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా చెట్ల నుంచి ఖర్జూర పండ్లను సేకరించి తింటారు. ఇక పట్టణ, నగరాల్లో ప్రజలు కొనుగోలు చేసి తింటారు. చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఖర్జురను తప్పక తింటారు. ఖర్జూర పండును తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

Read Also:Director Krish: రాడిసన్ డ్రగ్స్ కేసు.. విచారణకు హాజరుకాలేనని చెప్పిన డైరెక్టర్ క్రిష్!

అలాంటి ఖర్జూరం సాయంతో యూఏఈకి చెందిన ముగ్గురు ఇంజనీర్లు అద్భుతం చేశారు. ఖర్జూరం నుంచి విద్యుత్ తయారు చేశారు. ఎమిరాటీ ఇంజనీర్లు, కళాకారుల బృందం విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సాంప్రదాయ ఖర్జూరాలను వాడారు. ఈ ప్రయోగం ఎవరు ఎలా చేశారో తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ ఘనత ముగ్గురు వ్యక్తులకు చెందుతుంది. వారి పేర్లు డాక్టర్ అల్ అత్తార్, ఒమర్ అల్ హమ్మదీ, మొహమ్మద్ అల్ హమ్మదీ. ముగ్గురూ మజ్దూల్ ఖర్జూరాలను ఉపయోగించారు. ఈ ఖర్జూరం ప్రత్యేకత ఏమిటంటే ఇది పరిమాణంలో చిన్నది. రాగి పలకలను గట్టిగా పట్టుకోగలదు. ఈ ప్రక్రియ ఉద్దేశ్యం ఖర్జూరంలో ఉండే సహజ చక్కెరను సహజ శక్తిగా మార్చడం.

Read Also:Anasuya Bharadwaj: అందాలతో మాయ చేస్తున్న అనసూయ భరద్వాజ్..

డాక్టర్ అల్ అత్తార్, ఒమర్ అల్ హమ్మదీ, మహమ్మద్ అల్ హమ్మదీ ఖర్జూరంలో రాగి పలకలను పొందుపరిచారు. వీటిని వాహక లోహపు తీగతో అనుసంధానించారు. మోడల్ కోసం 20 ఖర్జూరాలు వాడారు.మెటల్ వైర్లు సర్క్యూట్‌ను పూర్తి చేస్తున్నప్పుడు రాగి ప్లేట్లు ఎలక్ట్రోడ్‌లుగా పనిచేస్తాయి. సెటప్ చిన్న మొత్తంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తుంది. తన సృష్టి వెనుక ఉన్న ప్రేరణను వివరిస్తూ, స్థానిక అరబ్ సంస్కృతిలో ఖర్జూరాలకు గొప్ప ప్రాముఖ్యత ఉందని మహమ్మద్ అల్ హమాది అన్నారు. ఖర్జూరంలో దాగి ఉన్న మరికొన్ని లక్షణాలను కనుగొనే క్రమంలో ఈ ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చిందని ఆ ముగ్గురు ఇంజనీర్లు తెలిపారు. సిక్కా ఆర్ట్ అండ్ డిజైన్ ఫెస్టివల్‌లో ముగ్గురు వ్యక్తులు తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు.