Site icon NTV Telugu

Padmarajan: నీకు ఇదేం పిచ్చి భయ్యా.. అన్ని సార్లు ఓడిపోయిన మళ్లీ పోటీ చేస్తానంటావ్..

Tamil

Tamil

ఎందులోనైనా ఎవరైనా ఒకసారి ఓడిపోతే ఆ ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితోనో.. గజినీ మహ్మద్ తోనో పోలుస్తుంటారు. అయితే, సేమ్ పట్టువీడని విక్రమార్కుడి లాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పద్మరాజన్‌ విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన కే పద్మరాజన్‌ 1988లో తొలిసారి మెట్టూరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

Read Also: Mukhtar Ansari : గుండెపోటుతో జైల్లో చనిపోయిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ

ఇక, అలా ఓడిపోయిన పద్మరాజన్ ప్రపంచంలోనే ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఇతని పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్టులో కూడా నమోదు అయింది. టైర్‌ పంచర్‌ షాప్‌ నడిపిస్తూ జీవనం సాగించే ఈ 65 ఏండ్ల కే పద్మరాజన్‌ ఈసారి తమిళనాడులోని ధర్మపురి పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని ఎలక్షన్స్ లో పోటీ చేసిన ఘనుడు పద్మరాజన్‌గా నిలిచాడు.

Exit mobile version