Site icon NTV Telugu

Road Accident: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి!

Road Accident

Road Accident

Chanda Nagar Road Accident: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారు చందానగర్‌కు చెందిన మనోజ్, రాజులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమ్మితం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: Tomato Price Hike: సామాన్యులకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన టమాటా ధర! కిలో ఎంతంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మదీనాగుడ జీఎస్ఎం మాల్ నుంచి చందానగర్‌కు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై మనోజ్, రాజులు వెళుతున్నారు. చందానగర్‌ జీఎస్ఎం మాల్ సమీపంలో యుటర్న్ దగ్గర రాంగ్ రూట్‌లో వెళుతూ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ నడుపుతున్న మనోజ్‌తో పాటు వెనకాల కూర్చున్న రాజు కూడా అక్కడిక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు.

Exit mobile version