NTV Telugu Site icon

Viral Video: వామ్మో.. ఇలాంటి వారితో జాగ్రత్త సుమీ..

Viral

Viral

Two Women’s Attack On Man video goes Viral in Social media: ప్రస్తుత ప్రపంచంలో మంచి చేయడానికి వెళ్లిన.. మనకి ఏదో ఒక అపాయం జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది. పక్కవారు ఇబ్బందుల్లో ఉండే వెళ్లి సహాయం చేసిన అది వారు గుర్తుపెట్టుకోకపోవడం పక్కనపెట్టి.. మనకి హాని కల్పించే రోజులు ఇవి. అచ్చం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని ఇద్దరు మహిళలు దారుణంగా దోపిడీ చేసిన విధానం వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

MLC Kavitha: నేడు కేసీఆర్‌ను కలువనున్న ఎమ్మెల్సీ కవిత..

ఈ వీడియో ప్రకారం చూస్తే ఈ ఘటన భారతదేశంలో కాకుండా పాశ్చాత్య దేశాలలో జరిగినట్లుగా అర్థమవుతోంది. రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు మద్యం తాగినట్లుగా కనపడుతూ రోడ్డుకు అటు ఇటు నడవడం వీడియోలో కనపడుతుంది. అలాగే వారికి ఎదురుగా ఓ వ్యక్తి కూడా రావడం గమనించవచ్చు. అయితే., ఇంతలో మహిళకి ఏదో గుండె దగ్గర నొప్పి వచ్చినట్లు బాధపడుతుంది. అయితే, వారికి ఎదురుగా వెళ్తున్న వ్యక్తి వెంటనే ఆ మహిళకు సహాయం చేయాలని వారి దగ్గరికి వెళ్ళగా ఇద్దరు మహిళలలో మరో మహిళ ఆ వ్యక్తి వెనుకలకు వెళ్లి.. ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న ఓ సిరంజిని తీసి అతనిలో ఇంజెక్ట్ చేసింది. దాంతో అతడు నొప్పితో విలవిల్లాడి రోడ్డుపై అలాగే పడిపోయాడు. అతడు రోడ్డుపై నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. ఆ ఇద్దరు మహిళలు అతనిని దోచుకొని అక్కడి నుంచి పారిపోవడం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈ కాలంలో మహిళలకు కాదు.. మగవారికి కూడా రక్షణ లేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Show comments