అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు రూమ్మేట్స్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడియాల భావన(24), పి.మేఘనా (24)లు తెలంగాణలోని మహబూబాబాద్ వాసులు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఒహియోలోని డేటన్లో ఇద్దరూ కలిసి నివసిస్తున్నారు. ఇటీవలే ఇద్దరి కోర్సులు పూర్తయ్యాయి. ఉద్యోగాల కోసం ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ ట్రిప్ కోసం కాలిఫోర్నియా వెళ్లి ప్రాణాలు పోగొట్గుకున్నారు. ఆదివారం సాయంత్రం కాలిఫోర్నియాలోని అలబామా హిల్స్ సమీపంలో కారు లోతైన లోయలో పడటంతో ఇద్దరూ మృతిచెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని మీడియా నివేదికలు తెలిపాయి.
