Great Wall of China: ఓ ఇద్దరు షార్ట్ కట్ రూట్ కోసం చేసిన పని చైనాకు పెద్ద డ్యామేజ్ చేసింది. కేవలం త్వరగా వెళ్లడం కోసం వారు ఏకంగా చైనా వాల్ కే కన్నం పెట్టేశారు. చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లోని యుయు కౌంటీ వద్ద ఉన్న యాంగ్‌కాన్హె టౌన్‌షిప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరైనా షాట్ కట్ కోసం మహా అయితే డివైడర్ లను పక్కకి తొలగించి వెళ్లడం మనం చూసుంటం.అయితే ఇక్కడ ఓ ఇద్దరు మాత్రం ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన ఏళ్ల నాటి చైనా వాల్ కే కన్నం పెట్టేశారు. పెట్టింది ఏదో చిన్నది కాదు ఏకంగా తమ వాహనం వెళ్లడానికి వీలైనంత కన్నం పెట్టేశారు.
Also Read: Gold Price Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
అసలు విషయంలోకి వెళ్తే 38 ఏళ్ల ఓ వ్యక్తి, అలాగే 55 ఏళ్ల ఓ మహిళ గ్రేట్ చైనా వాల్ కు సమీపంలో ఓ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన దానిలో పని చేస్తున్నారు. అయితే వారు అక్కడికి వెళ్లాలంటే ఈ గోడ అడ్డుగా ఉంది. అది లేకుంటే వారికి చాలా సమయం, డబ్బు కూడా ఆదా అవుతుందని ఆలోచించిన వారు దానికి చిన్న గ్యాప్ కనిపించడంతో ఇక దానిని పెద్దగా చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా దానికి వారి వాహనాలు వెళ్లేంత పెద్ద కన్నం పెట్టేశారు. ఇక దీనికి సంబంధించి ఆగస్టు 24న పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ గోడను పరిశీలించి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారి వల్ల చైనాకు తీరని అన్యాయం జరిగిందని పోలీసులు తెలిపారు. వారు దానిని ఎలా తవ్వారు అనే విషయాన్ని సీసీ కెమెరాలు పరిశీలించి తెలుసుకుంటున్నారు. చైనా సమగ్రతకు, ప్రతిష్టకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మకమైన గోడను కూల్చేయడం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని క్రీ.పూ.200 సంవత్సరంలో మింగ్ వంశస్తులు ప్రారంభించారు. అయితే దీనిని పూర్తి చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది.దాదాపు క్రీ.శ 1600 లో దీనిని పూర్తి చేశారు. అయితే అలాంటి దానికి తెలిసి తెలియక ఇద్దరు కొన్ని రోజుల్లో కన్నం పెట్టేశారు.