Site icon NTV Telugu

Leopards in Balapur: హైదరాబాద్‌లో చిరుతల కలకలం.. బాలాపూర్‌లో రెండు చిరుతలు..

Leopard

Leopard

Leopards in Balapur: హైదరాబాద్‌ శివారులోని.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది.. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ [ఆర్సీఐ] ప్రాంగణంలో చిరుతలు సంచరించాయి.. దీంతో అప్రమత్తమైన డిఫెన్స్‌ అధికారులు.. రెండు చిరుతపులులు సంచరిస్తున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..

Read Also: Kingdom: ‘కింగ్డమ్’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

కాగా, బలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) క్యాంపస్‌లో రెండు చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులు అక్కడి సిబ్బంది మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, అత్యవసరమైతే తప్ప, ఆ ప్రాంతానికి వెళ్లరాదని.. చిరుతలు కనిపించినట్లయితే వెంటనే అటవీ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. ప్రజలకు సూచించారు అధికారులు.. అయితే, ప్రస్తుతం అటవీ అధికారులు రెండు చిరుతలను గుర్తించి.. వాటిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలతో చర్యలు తీసుకుంటున్నారు. జనజీవనం సురక్షితంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read Also: Health Tips: బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?.. అయితే ఈ సమస్యలకు ఆహ్వానం పలికినట్టే!

ఇక, దీనిపై డిఫెన్స్ లాబరేటరీ స్కూల్ ప్రిన్సిపల్ శుక్రవారం రోజు ఓ నోట్‌ విడుదల చేశారు.. రెండు చిరుతల సంచారం నేపథ్యంలో.. విద్యార్థుల తల్లిదండ్రులకు నోటీసు జారీ చేశారు.. విద్యార్థులను తీసుకురావడానికి, తీసుకెళ్లే సమయంలో అప్రమత్తం ఉండాలని.. సూచించారు.

Exit mobile version