Road Accident: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 97 వద్ద అతివేగంగా దూసుకెళ్లిన కారు నియంత్రణ తప్పి పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థులు మొత్తం ఎనిమిది మంది బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు కారు (TS 32 G 1888)లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది.
MLA Arava Sridhar Controversy : ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు..!
ఈ ఘటనలో సాయి వరుణ్, నిఖిల్ అనే విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకట్, రాకేష్, యశ్వంత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన సాత్విక్, హర్షవర్దన్, అభినవ్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Off The Road: చుట్టపు చూపుగా కందుకూరు వైసీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ !
మృతుల్లో ఒకరైన సాయి వరుణ్ వనపర్తి జిల్లాకు చెందినవాడు. ఆయన BSC బయోటెక్నాలజీ చదువుతున్నాడు. సాయి వరుణ్ తండ్రి రాజశేఖర్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి సంధ్య రాణి. గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న సాయి వరుణ్ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఒక్కసారిగా కుమారుడిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
