Site icon NTV Telugu

ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. వారికి నోటీసులు !

ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో NCB దర్యాప్తు వేగవంతం చేసింది. మరోసారి విచారణకు రావాలని హీరోయిన్ అనన్య పాండేకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అనన్యను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వేధిస్తోందని మండి పడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. పోలీసులు హెరాయిన్‌ పట్టుకుంటే.. ఎన్సీబీ హీరోయిన్లను పట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్‌ బెయిల్ పిటిషన్‌పై ఎన్సీబీ సోమవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది.ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చిన్నగా అనన్య పాండే మెడకు చుట్టుకుంటోంది. ఆర్యన్‌, సారా అలీఖాన్‌కు అనన్య మంచి ఫ్రెండ్.

ఇప్పటికీ ఆమె స్నేహితులిద్దరూ డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్నారు. సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అధికారులు సారా అలీఖాన్‌ను ప్రశ్నించారు. తాజాగా ఆర్యన్ వ్యవహారంలో అనన్యను ఎన్సీబీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే మూడు సార్లు అనన్యను విచారించిన ఎన్సీబీ.. సోమవారం మరోసారి ఆఫీసుకు రావాలని నోటీసులిచ్చింది.మొన్న సుశాంత్ సింగ్, ఇప్పుడు ఆర్యన్ ఖాన్.. బాలీవుడ్‌లో ప్రముఖ తారలంతా సౌత్ ముంబయిలో బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్సీపీ ఆఫీసుకి క్యూ కడుతున్నారు. డ్రగ్స్ కేసులో లింకులపై ఎన్సీబీ అధికారులు అనన్య పాండేను ప్రశ్నిస్తున్నారు.

ఆర్యన్‌తో అనన్య వాట్సప్‌లో చాటింగ్ చేసిందని… ఇందులో డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉందని సమాచారం.2018 -19లో ఆర్యన్ డ్రగ్స్ కొనేందుకు అనన్య మూడు సార్లు హెల్ప్ చేసిందని, డ్రగ్‌‌ డీలర్ల నెంబర్లను వాట్సాప్ చాట్ లో అతనికి షేర్ చేసిందని ఎన్సీబీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదంతా జోక్‌ కోసం చేసినట్లు అనన్య ఎన్సీబీ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ జరగనుంది. విచారణకు ముందే ఎన్సీబీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఎన్సీబీ అధికారులు సోమవారం అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.

Exit mobile version