NTV Telugu Site icon

TVS Jupiter 110cc: స్టన్నింగ్ లుక్స్, అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో హల్చల్ చేస్తున్న జూపిటర్

Jupiter

Jupiter

టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జూపిటర్ 110cc ను విడుదల చేసింది. కొత్త టీవీఎస్ జూపిటర్ 110 OBD-2B కంప్లైంట్ ఇంజిన్‌తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో హోండా యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న 110సీసీ స్కూటర్లలో జూపిటర్ ఒకటి. ఇక ఈ స్కూటర్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. హై-ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇది కలర్ ఎల్సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ తో వస్తుంది. దీనికి MapMyIndia సపోర్ట్ ఉంటుంది. సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో గ్యాస్ నిండిన ఎమల్షన్ డంపర్‌లను ఉపయోగించారు.

Read Also: Minister Nara Lokesh: రెడ్‌ బుక్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు.. ఆ ఆలోచన వద్దు..!

జూపిటర్ 110 ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 220mm డిస్క్, వెనుక భాగంలో 130mm డ్రమ్ బ్రేక్‌ను ఉపయోగించారు. ఈ స్కూటర్‌ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డ్రమ్ అల్లాయ్, డ్రమ్ SXC, డిస్క్ SXC వేరియంట్లలలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరల విషయానికి వస్తే.. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,691, డ్రమ్ అల్లాయ్ ధర రూ.83,541, డ్రమ్ SXC ధర రూ.87,091, డిస్క్ SXC ధర రూ.90,016 ఎక్స్-షోరూమ్ ధరలుగా ఉన్నాయి.

నూతన జూపిటర్ 110 స్కూటర్‌ 113.3cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 rpm వద్ద 7.9 bhp పవర్, 5000 rpm వద్ద 9.2 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. iGo అసిస్ట్ ఫీచర్‌ తో 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌ CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడింది. ఇది లీటరుకు 55 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, టైటానియం గ్రే మ్యాట్, ట్విలైట్ పర్పుల్ గ్లోస్, మీటియోర్ రెడ్ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్ లాంటి ఏడు రంగుల ఎంపికల నుండి తమకు నచ్చిన రంగును కస్టమర్స్ ఎంచుకోవచ్చు.

Read Also: Minister Nara Lokesh: రెడ్‌ బుక్‌పై లోకేష్‌ కీలక వ్యాఖ్యలు.. ఆ ఆలోచన వద్దు..!

మార్చి 2025 చివరి నాటికి కంపెనీ తన మొత్తం ఉత్పత్తి శ్రేణిని OBD-2B ప్రమాణాలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త జూపిటర్‌ను ప్రారంభించడం ద్వారా, కంపెనీ ఈ మార్గంలో మొదటి అడుగు వేసింది. మొత్తానికి ఈ అప్డేటెడ్ జూపిటర్ 110 స్కూటర్‌ సాంకేతికత, ఫీచర్లు, మైలేజీ పరంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మెరుగైన బ్రేకింగ్, సస్పెన్షన్ సిస్టమ్, కలర్ LCD డిస్‌ప్లే వంటి సదుపాయాలతో ఇది యువతతో పాటు అన్ని వయస్సుల వారికి సరిపోతుంది.