NTV Telugu Site icon

Smoking : ఏంటయ్యా ఇది.. అది చేయకూడదని ఇలా చేయడం అవసరమా?

New Project (2)

New Project (2)

Smoking : చాలామందికి ధూమపానం ఓ వ్యసనం. దాన్ని మానేయాలని చాలామంది తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా గానీ మానలేరు. కానీ టర్కీకి చెందిన ఓ వ్యక్తి పొగతాగడం మానేయడానికి పెద్ద తపస్సే చేశాడు. ఏకంగా తన తలను తీసుకెళ్లి ఓ బోనులో బంధించాడు. చెడు వ్యసనాల నుంచి బయటపడటానికి కొంతమంది రీహాబిలిటేషన్ సెంటర్స్ ని ఆశ్రయిస్తుంటారు. కౌన్సెలింగ్ లు తీసుకుంటారు. అయితే ఓ వ్యక్తి చేసిన పని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టర్కీ కుతాహ్యా సిటీకి చెందిన ఇబ్రహీం యూసెల్ అనే వ్యక్తి పొగ తాగడానికి బానిస అయ్యాడు. అయితే అతని తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించిన తరువాత తాను ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్నాడు.

Read Also:Rain: విషాదం నింపిన వర్షం.. విద్యుత్‌ వైర్లు తెగిపడి కానిస్టేబుల్‌ మృతి

అందుకోసం తాను బైక్ నడిపేవారు పెట్టుకునే హెల్మెట్లను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 130 అడుగుల రాగి తీగను వినియోగించి హెల్మెట్ లాగా తయారు చేయించాడు. తనకి సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఎక్కడ దానికి లొంగిపోతాననే భయంతో దాని తాళం చెవి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చాడు. ఇక అతను ఈ అలవాటు నుంచి బయటపడటానికి అతని భార్య ఎంతో మద్దతు ఇచ్చిందట. ఈ కథ ఇప్పటిది కాదు. 10 ఏళ్ల నాటిదట. అయితే తాజాగా ఈ స్టోరి బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఇతని స్టోరి వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఇదేదో బాగుందే.. అని కొందరు.. ఈ అలవాటు నుంచి ఇప్పుడు అతను పూర్తిగా బయటపడ్డాడా? అని కొందరు ప్రశ్నించారు. చెడు వ్యసనాల నుంచి బయటపడాలంటే సరైన కౌన్సెలింగ్ తో పాటు పట్టుదలతో కూడిన నిర్ణయం తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also:Chandrababu Naidu: రజనీకాంత్ కు వైసీపీ నేతలు సారీ చెప్పాలి