TTD : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD : అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ నెలకు సంబంధించిన ఈ టిక్కెట్లను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల చేయనుంది టీటీడీ పాలకమండలి. గురువారం, శుక్రవారం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లతో పాటుగా అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు ఉంటాయి.
Read Also: Brahmotsavam: భద్రాద్రిలో రాములోరి కల్యాణం.. సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
Also Read
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
అదేవిధంగా, మిగతా ఆర్జితసేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియను మార్చి 24న మొదలవుతుంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు నిర్ణీత రుసుం చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిని టీటీడీ వెబ్ సైట్ తో పాటు యాప్ ద్వారా భక్తులు టికెట్లను పొందే అవకాశం ఉంది. వయోవృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
Read Also:Sai Chalisa: గురువారం సాయి చాలీసా వింటే సర్వశుభాలు కలుగుతాయి
మరోవైపు, తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానం అమల్లోకి తెచ్చింది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో పారదర్శకతను పెంచేందుకు ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీని తీసుకొచ్చింది. మార్చి ఒకటి నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర కాషన్ డిపాజిట్ కౌంటర్ల దగ్గర ఈ టెక్నాలజీని వాడకంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టోకెన్లు లేని వారికి సుమారు 15 గంటల సమయం పడుతోంది.
తాజావార్తలు
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!