Site icon NTV Telugu

TTD Employees: టీటీడీలో బైబిల్స్ పంపిణీ.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!

Ttd Devotees

Ttd Devotees

Bible distribution in TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై పిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి పిర్యాదు అందగా.. అధికారులు చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికే 5 మంది అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడినా.. అన్యమత ఉద్యోగుల తీరు మారడం లేదు.

Also Read: Prithvi Shaw: పృథ్వీ షాకు కాస్త చూపించండయ్యా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చురకలు!

తాజాగా అన్యమత ఉద్యోగులపై టీటీడీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇతర మతాలకు చెందిన నలుగురు ఉద్యోగులను టీటీడీ అధికారులు సస్పెండ్‌ చేశారు. నాణ్యతా విభాగంలో డిప్యూటీ ఇంజినీర్‌ బీ.ఎలిజర్‌, బర్డ్‌ దవాఖానలో స్టాఫ్‌ నర్సు ఎస్‌.రోసి, గ్రేడ్‌-1 ఫార్మాసిస్ట్‌ ఎం.ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో ఉద్యోగి జీ.అసుంత సస్పెండ్‌ అయ్యారు. ఈ నలుగురు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు తేలడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ.. బాధ్యతారాహిత్యంగా వ్యవహించారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version