తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల కై ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం టీఆర్టీ-2023 నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది.. రాష్ట్ర వ్యాప్తం గా 5,089 టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది..అయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను ఇవాళ విడుదల చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎంతగానో కసరత్తు చేసారు.. ఈ నెల 15 న జిల్లాల వారీగా సబ్జెక్టులు మరియు మీడియం పోస్టుల ఖాళీల వివరాలు, రోస్టర్ వివరాలు వెల్లడిస్తామని డీఎస్సీ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్ల ప్రక్రియలో అధికారులు కాస్త బిజీ గా ఉండడంతో టీఆర్టీ కి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైందని సమాచారం. అయితే టీఆర్టీ సమగ్ర నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 18న అధికారులు www.schooledu.telangana.gov.in వెబ్ సైట్ లో ఉంచుతారని అధికారులు తెలిపారు.
ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.తెలంగాణ టీఆర్టీ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.టీఆర్టీ డిటైయిల్డ్ నోటిఫికేషన్ ను అధికారులు వెబ్ సైట్ లో ఉంచుతామని తెలిపారు. అలాగే ముఖ్యమైన తేదీలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ (లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్), లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యా శాఖ వారు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 5,089 ఖాళీలను భర్తీ చేయనున్నారు.వయోపరిమితి, విద్యార్హత, ఇతర అర్హత ప్రమాణాలతో సహా డిటైయిల్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నేడు విడుదల చేసే అవకాశం ఉంది. టీఆర్టీ లో భాగం గా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 15 న టెట్ ఎగ్జామ్ నిర్వహించింది. ఆ ఎగ్జామ్ ఫలితాలను ఈ నెల 27 న ప్రకటించనుంది.