Site icon NTV Telugu

TS TET : టెట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన ప్రభుత్వం..

Whatsapp Image 2023 09 09 At 3.21.14 Pm

Whatsapp Image 2023 09 09 At 3.21.14 Pm

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లో భాగంగా ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2023) ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా..దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16న ముగిసింది.దరఖాస్తు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.. టెట్ పరీక్ష ను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.దీనిలో భాగంగానే అధికారులు నేడు టెట్ హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోగలరని అధికారులు తెలియజేసారు.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక సైట్ ను సందర్శించి.. తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెస్టెంబర్ 15 వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్షను , అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షను ను నిర్వహించనున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 27న ఫలితాలను విడదుల చేస్తామని అధికారులు నోటిఫికేషన్లో వెల్లడించారు.

ఇదిలా ఉంటే దాదాపు ఆరు సంవత్సరాల తరువాత తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాదాపు 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ నెల 20 వ తేదీ నుండి అక్టోబర్ 21 వ తేదీ వరకు కొనసాగుతుంది. అలాగే టీఆర్టీ ను నవంబర్ 20 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఆన్లైన్ లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించింది. టెట్ కు అర్హత సాధించిన వారందరు కూడా టీఆర్టీ కు ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా అధికారులు ప్రకటించారు. అయితే టెట్ కు సంబంధించి గత నోటిఫికేషన్ తో పోల్చితే ఈ సారి టెట్ పరీక్షకు దరఖాస్తులు తగ్గాయి.గతంలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఈ సారి దాదాపు అందులో సగం మాత్రమే రావడం విశేషం.. అభ్యర్థులంతా గురుకుల పరీక్షకు సన్నద్ధం అవ్వడంటో టెట్ పై ఫోకస్ చేయలదని అధికారులు భావిస్తున్నారు. డీఎస్సీ లో టెట్‌ మార్కులకు 20 శాతం మేర వెయిటేజీ ఉండటంతో టెట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది.

Exit mobile version