NTV Telugu Site icon

TS Polycet Counselling: పాలిటెక్నిక్ చేరే విద్యార్థులకి అలెర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

Polycet

Polycet

నేడు తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను వివిధ పాలిటెక్నిక్ కాలేజిలలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలీసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం నాడు పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగింది. పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా కేంద్రాలలోకి అభ్యర్థులను ప్రవేశం కలిపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు మొత్తం 92,808 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈ పాలీసెట్‌ను నిర్వహించింది.

ఇక నేడు జరిగిన పరిక్షలో మొత్తం 92,808 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 82809 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. మొత్తంగా 89.23% మంది పరికాశాలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఇక పాలిసెట్ కౌన్సెలింగ్ సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలైంది. ఈ కౌన్సెలింగ్ మొత్తం రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ మొదలు కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, అలాగే జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.

ఇక జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ మొదలు కానుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, అందుకు సంబంధించి జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు జరగనుంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ పక్రియను కన్వీనర్ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జులై 21 నుండి ఇంటర్నల్ స్లైడింగ్‌ కి అవకాశమిచ్చారు. అందుకు సంబంధించి జులై 24న సీట్లను కేటాయిస్తారు. జులై 23న స్పాట్ అడ్మిషన్ సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తారు.

Show comments