NTV Telugu Site icon

TS MBBS Web Options 2023: నేటి నుంచే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకు వెబ్‌ ఆప్షన్లు!

Ts Mbbs Web Options 2023

Ts Mbbs Web Options 2023

2023 Web Options for MBBS and BDS Seats from Today: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల అయింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) గురువారం ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కన్వీనర్‌ కోటా సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు శుక్రవారం (ఆగష్టు 4) ఉదయం 10 గంటల నుంచి ఆదివారం (ఆగష్టు 6) సాయంత్రం 6 గంటలలోపు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్‌ జాబితా, వైద్య కళాశాలల వారీగా సీట్ల వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.inలో ఉంటాయి.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో ప్రవేశాలకు కూడా కాళోజీ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆగష్టు 4 ఉదయం 10 గంటల నుంచి ఆగష్టు 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలన అనంతరం అభ్యర్థుల మెరిట్‌ జాబితా విడుదల కానుంది.

Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు! నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఈఏడాది విద్యా సంవత్సరం నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వార్షిక ఫీజు రూ. 12 వేలుగా ఉంది. ఇదే ఫీజు మరో మూడేళ్ల పాటు కొనసాగనుంది. ప్రైవేటు/ మైనార్టీ/ నాన్‌మైనార్టీ, ఈఎస్‌ఐ కాలేజీల్లో ఏ కేటగిరి (కన్వీనర్‌ కోటా) సీట్ల ఫీజును యథాతథంగా ఉంచారు. గతంలో ఏడాదికి రూ. 60 వేలు ఉండగా.. రానున్న మూడేళ్లకు ఇదే కొనసాగనుంది.

కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఫీజును తగ్గించారు. దక్కన్‌ కాలేజి ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో బీ కేటగిరి సీటు ఫీజును రూ. 14.5 లక్షలు నుంచి రూ. 12.50 లక్షలకు.. షాదన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఫీజును రూ. 14 లక్షల నుంచి రూ. 12 లక్షలకు తగ్గించారు. అపోలో వైద్య కళాశాల, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ల్లో బీ కేటగిరి సీటు ఫీజు రూ. 12.5 లక్షల నుంచి రూ. 13 లక్షలకు పెరిగింది. మల్లారెడ్డి మహిళా మెడికల్‌ కాలేజీ, మమత అకాడమీ ఆఫ్‌మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమా, మెడిసిటీ, ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో బీ కేటగిరి సీటు ఫీజు రూ. 11.55 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెరిగింది.

Also Read: Ind vs WI: ఉత్కంఠ పోరులో భారత్ పరాజయం