TS Lawcet : తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Lawcet : తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1వ తేదీన లాసెట్, పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. లాసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి రవీందర్, లాసెట్ కన్వీనర్ బీ విజయలక్ష్మి కలిసి విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అధికారులు సూచించారు.
ఫీజు వివరాలు..
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 600గా దరఖాస్తు ఫీజుగా నిర్ధారించారు. రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 12 వరకు, రూ. 1000తో ఏప్రిల్ 19 వరకు, రూ. 2 వేలతో ఏప్రిల్ 26 వరకు, రూ. 4 వేలతో మే 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించొచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ చేసుకునేందుకు మే 5 నుంచి 10వ తేదీ వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 25న టీఎస్ లాసెట్, టీఎస్ పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. తదితర వివరాల కోసం https://lawcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
Also Read
అదే విధంగా ఈసెట్ షెడ్యూల్‌నూ అధికారులు ఖరారు చేశారు. మార్చి 1న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 2 నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 15 నుంచి హాల్‌టికెట్లు జారీ చేసి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!