NTV Telugu Site icon

TS Govt : రాష్ట్రం లో 5500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే ఆలోచనలో వున్న ప్రభుత్వం..?

Whatsapp Image 2023 08 17 At 10.50.00 Am

Whatsapp Image 2023 08 17 At 10.50.00 Am

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడటం తో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ వస్తుంది. దాదాపు అన్ని శాఖలలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టి దాదాపు పూర్తి చేసుకుంటూ వస్తుంది.పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు ఇంకా పెండింగ్ లో వున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలనే భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా దాదాపు 5,000 మంది ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేశాక ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. జులై 7న ‘మనఊరు- మనబడి’పై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సందర్భంగా 9,370 ఉపాధ్యాయ ఖాళీలను టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) ద్వారా భర్తీ చేయాల్సి ఉందని విద్యా శాఖ ప్రతిపాదించింది.,

అయిదు వేల మంది మిగులు ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలో సర్దుబాటు చేశాక కూడా నియామకాలు పూర్తయ్యే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉందని విద్యాశాఖ తెలిపింది..ఆ తరువాత పూర్తిస్థాయి లో కసరత్తు చేశాక దాదాపు 5,500 వరకు కొత్త నియామకాలు జరపాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.దీనితో దాదాపు నాలుగు వేల పోస్టుల కు కోత పడినట్లు తెలుస్తుంది..ఉపాధ్యాయ నియామక ప్రక్రియ లో భాగంగా పాఠశాల విద్యా శాఖ ఆగస్టు 1 వ తేదీన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ నోటిఫికేషన్ లో సెప్టెంబరు 15న టెట్‌ నిర్వహించి, సెప్టెంబర్ 27 న ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపింది. ఆ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.కొత్తగా చేపట్టే ఉపాధ్యాయ నియామకాలకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే సెప్టెంబరు నెలాఖరులో నోటిఫికేషన్‌ జారీ చేసినా కూడా కొత్త ఉపాధ్యాయులు వచ్చే విద్యా సంవత్సరం లోనే చేరనున్నట్లు తెలుస్తుంది

Show comments