NTV Telugu Site icon

TS Traffic E-Challan: పెండింగ్ చలానా రాయితీ గడువు మరో ఐదు రోజులే!

Ts Traffic E Challan

Ts Traffic E Challan

Telangana Offers discounts on Pending Traffic Challan: తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం.. ఆర్టీసీ బస్సులకు 90 శాతం.. ఇతర వాహనాలకు (కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌) 60 శాతం రాయితీ ప్రకటించింది. 2023 డిసెంబరు 25 వరకు ఉన్న చలాన్లపై.. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 10 వరకు చెల్లింపులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటికే 11 రోజులు పూర్తవగా.. పెండింగ్ చలాన్లకు గడువు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలున్నాయి.

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసుల రికార్డుల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి. డిసెంబరు 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి.. రూ. 66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. వాహన దారులకు తమ పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు మరో ఐదు రోజుల గడువు ఉంది.

Also Read: Bangladesh : బంగ్లాదేశ్ లో రైలుకు నిప్పు.. ఐదుగురు సజీవ దహనం

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లకు అవకాశం మరో 5 రోజులు (జనవరి 10) మాత్రమే ఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ ఎం విశ్వప్రసాద్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సైబర్‌ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690 (వాట్సప్‌) నంబర్లలో సంప్రదించాలని విశ్వప్రసాద్‌ సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.