NTV Telugu Site icon

TS DSC : 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి..

Whatsapp Image 2023 08 25 At 4.12.26 Pm

Whatsapp Image 2023 08 25 At 4.12.26 Pm

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.నిరుద్యోగుల కోసం టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు.రెండు రోజుల్లో నోటిఫికేషన్ కు సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. తాజాగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టుల భర్తీకి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా కూడా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్ లను ఇచ్చి దాదాపు అన్ని ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఇక మిగిలింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఒక్కటే. ఇవాళ్టితో ఆ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కల నెరవేరింది. దాదాపు 5 సంవత్సరాల తరువాత రాష్ట్రంలో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది..ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరి రాష్ట్రములో టెట్ అర్హత సాధించని వారు 2 లక్షల మంది వున్నారు. ఇంకా 20 వేల మంది వరకు కొత్తగా డిఈడి, బిఈడి పూర్తి చేసిన వారు వున్నారు. వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.సెప్టెంబరు 15వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించి సెప్టెంబర్ 27 న టెట్ ఫలితాలను విడుదల చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ లో తెలియజేసింది