San Francisco: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధంతో ప్రపంచ దేశాలపై బెదరింపులకు దిగినట్లే సొంతం దేశంలో కూడా ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలను బెదిరిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు ట్రంప్ తాజా నిర్ణయం బలం చేకూర్చుతుందని అంటున్నారు. ఆదివారం ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆయన నిర్ణయంతో యూఎస్‌లో కలకలం చెలరేగుతుంది. ఇంతకీ ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారో తెలుసా..
READ ALSO: Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి దీపావళి పోస్టర్
ఇంటర్వ్యూలో ట్రంప్ ఏం చెప్పారు..
ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. శాన్ ఫ్రాన్సిస్కోకు దళాలను పంపుతానని పేర్కొన్నారు. డెమోక్రాటిక్ నియంత్రణలో ఉన్న నగరాల్లో అమెరికా సైనిక దళాల మోహరింపును పెంచాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్ లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్, మెంఫిస్‌లకు నేషనల్ గార్డ్స్‌ను పంపగా, చికాగో, పోర్ట్‌ల్యాండ్‌లోని స్థానిక కోర్టులు ఇలాంటి మోహరింపులను నిరోధించాయి.
ట్రంప్.. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇప్పుడు నేసషనల్ గర్డ్స్ శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడి ప్రజలు మనల్ని కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. శాన్ ఫ్రాన్సిస్కో ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటి, కానీ దాదాపు 15 ఏళ్ల క్రితం, ప్రతిదీ తప్పుగా జరిగింది. మనం అక్కడికి వెళ్లి దానిని మళ్ళీ గొప్పగా మార్చోతున్నాం ” అని అన్నారు. పలు అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రకారం.. ట్రంప్ సైనిక మోహరింపును సమర్థించుకోవడానికి అమెరికా నగరాల్లో నేరాలు, అశాంతిని పదేపదే అతిశయోక్తి చేస్తున్నారని వెల్లడించాయి. గత నెలలో అమెరికా నగరాలను సైనిక శిక్షణా స్థలాలుగా ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు.
జాతి, భాష ఆధారంగా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న వలస దాడులకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనల తరువాత జూన్‌లో నేషనల్ గార్డ్‌ను మొదటిసారి లాస్ ఏంజిల్స్‌కు మోహరించారు. ఆ సమయంలో ట్రంప్ చర్యలను కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా విమర్శించారు. న్యూసమ్ 2027 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులలో ఒకరిగా ఉన్నారని పలు కథనాలు వస్తున్నాయి.
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టెక్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్.. ఇటీవల నగరానికి నేషనల్ గార్డ్‌ను పంపాలని పిలుపునిచ్చిన సమయంలో ట్రంప్ ప్రకటన వెలువడింది. ఈ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా మారింది. రిపబ్లికన్ మీడియా ఈ నగరాన్ని నిరాశ్రయత, మాదకద్రవ్య వ్యసనంతో పోరాడుతున్నట్లుగా పేర్కొంది.
READ ALSO: Saudi Arabia: సౌదీ అరేబియాలో బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్.. హైస్పీడ్ రైల్వేకు బిలియన్ డాలర్లు!
