Site icon NTV Telugu

Tariff Dividend: అమెరికన్లకు ట్రంప్ గిఫ్ట్.. ‘టారిఫ్ డివిడెండ్’ పేరుతో సర్‌ప్రైజ్ ప్యాకేజ్!

Donald Trump

Donald Trump

Tariff Dividend: సంచలనాలకు కేంద్ర బిందువు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. వాస్తవానికి ఆయన ప్రకటన చాలా మంది అమెరికన్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అమెరికన్లకు త్వరలో $2,000 (రూ. 1.77 లక్షలు) చెల్లింపు అందుతుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దీనిని తన “టారిఫ్ డివిడెండ్”గా అభివర్ణించారు. అంటే సుంకాల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా డబ్బు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో వరుస పోస్ట్‌లలో ఆయన ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి ఇది అమెరికన్ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించింది.

READ ALSO: Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?

ట్రంప్ ప్రకటనలో ఏం ఉంది..
ట్రంప్ తన ప్రకటనలో ఇలా రాశారు.. “ప్రతి వ్యక్తికి కనీసం $2,000 డివిడెండ్ లభిస్తుంది. అధిక ఆదాయం ఉన్నవారు దీనిని పొందరు.” అయితే ఈ చెల్లింపులు ఎప్పుడు ప్రారంభమవుతాయో లేదా “అధిక ఆదాయం” నిర్వచనం ఏమిటో ఆయన తన పోస్ట్‌లో పేర్కొనలేదు. US చరిత్రలో అత్యంత పొడవైన ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం యావత్ అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది. వాస్తవానికి ఇప్పుడు చాలా మంది అమెరికన్లు ఆహారం కోసం ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్నారు. అయినప్పటికీ శనివారం రాత్రి ట్రంప్ ఫ్లోరిడాలోని తన విలాసవంతమైన మార్-ఎ-లాగో క్లబ్‌లో విలాసవంతమైన విందులో పాల్గొన్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

ట్రంప్ తన సుంకాల విధానాన్ని సమర్థిస్తూ ఇలా పోస్ట్ చేశారు.. “సుంకాలను వ్యతిరేకించే వారు మూర్ఖులు! మనం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా అవతరించాం. దేశంలో ద్రవ్యోల్బణం దాదాపుగా పోయింది, స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉంది.” తన 401(k) పదవీ విరమణ నిధి ఇప్పటివరకు అతిపెద్ద వృద్ధిని నమోదు చేసిందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “అమెరికా ఇప్పుడు ట్రిలియన్ల డాలర్లను సంపాదిస్తోంది, త్వరలో దాని భారీ $37 ట్రిలియన్ల రుణాన్ని చెల్లించడం ప్రారంభిస్తుంది” అని అధ్యక్షుడు పేర్కొన్నారు. దేశంలో పెట్టుబడి, ఫ్యాక్టరీ నిర్మాణం రికార్డు వృద్ధిని సాధిస్తోందని ఆయన వెల్లడించారు.

అయితే ట్రంప్ సుంకాల విధానంపై సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. గత వారం ట్రంప్ అత్యవసర అధికారాల కింద అనేక దేశాలపై వాణిజ్య సుంకాలను విధించడాన్ని కోర్టు ప్రశ్నించింది. వీటిని మూడు దిగువ కోర్టులు ఇప్పటికే చట్టవిరుద్ధమని ప్రకటించాయి. దీనికి ట్రంప్ ప్రతిస్పందిస్తూ “అమెరికా అధ్యక్షుడు ఒక విదేశీ దేశంతో అన్ని వాణిజ్యాన్ని నిలిపివేయవచ్చు, కానీ జాతీయ భద్రత కోసం సాధారణ సుంకాన్ని విధించలేరా? ఇది మన గొప్ప వ్యవస్థాపకులు ఉద్దేశించినది కాదు!” అని ఆయన పేర్కొన్నారు.

READ ALSO: IPL Trade Rules: IPL 2026 వేలం రాబోతుంది.. ట్రేడింగ్ విండో అంటే తెలుసా?

Exit mobile version