Trump’s South Asia Strategy: నిత్యం తన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న అగ్రరాజ్యాధినేత ఆలోచనలు, వ్యూహాలు ఏమిటి? భారత్‌ను ప్రత్యేక స్నేహితుడు అంటూనే 50% సుంకం విధించిన ఆయన తీరును ఏమని అర్థం చేసుకోవాలి. కేవలం 19% సుంకం విధించి పాకిస్థాన్‌పై ఆయన ఎందుకంత ప్రేమ కనబరుస్తున్నారు. చైనా విషయంలో ఆయన తీరు ఇండియా విషయంలో ఉన్నంత ఇదిగా లేకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ట్రంప్ మదిలో మెదిలే ప్రణాళికలు ఏమిటో తెలుసుకుందాం..
READ MORE: AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. అతడిని వెంటనే విడుదల చేయండి..
దక్షిణాసియాలో కొత్త దౌత్య క్రీడా..
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్న పలువురు విదేశీ వ్యవహార నిపుణులు ట్రంప్ దక్షిణాసియాలో కొత్త దౌత్య క్రీడను ప్రారంభించారని పేర్కొంటున్నారు. ఆయన తదుపరి లక్ష్యం భారతదేశం, చైనాలని అంచనా వేస్తున్నారు. ఈ రెండు బలమైన దేశాలపై గురి పెట్టడానికి పాకిస్థాన్‌ను పావుగా మార్చుకుంటున్నారని అన్నారు. భారత్‌ను “ప్రత్యేక స్నేహితుడు” అని పిలుస్తూ దానిపై 50% సుంకం విధించిన యూఎస్, పాకిస్థాన్‌కు కేవలం 19% సుంకం, అనేక రాయితీలు ఇవ్వడం ఈ కొత్త ప్రణాళికలో భాగంగానే చూస్తున్నారు. దక్షిణాసియాలో ప్రబల శక్తులుగా ఉన్న భారతదేశం-చైనా ప్రభావాన్ని తగ్గించి పాకిస్థాన్‌ను అమెరికా శిబిరంలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నంగా పేర్కొంటున్నారు. ట్రంప్ సుంకాల తీరుపై పాక్ పెద్దగా స్పందించకుండా నిశ్శబ్దంగా అంగీకరించింది. దీనిని కొందరు విశ్లేషకులు “ఆర్థిక లొంగుబాటు” అని పిలుస్తున్నారు. ఇలా పాక్ ఆర్థిక లొంగుబాటుకు గురికావడానికి రెండు కారణాలు ఉన్నాయని.. మొదటిది ఆర్థిక సహాయం, రెండవది దౌత్యపరమైన మద్దతు అని అన్నారు.
నిజమైన స్నేహితుడిపై ఎందుకింత ద్వేషం…
G-20 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ భారత్‌ను నిజమైన స్నేహితుడు అని ప్రశంసించారు. కానీ ఆ తర్వాత ఆయన రష్యాతో భారతదేశం స్నేహాన్ని సాకుగా చూసి ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై 25% సుంకం విధించారు. తరువాత దానికి మరో 25% సుంకం విధించారు. దీని కారణంగా ఇప్పుడు భారతీయ వస్తువులు అమెరికన్ మార్కెట్లో 50% వరకు పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఎలక్ట్రానిక్స్, మందులు, ఆటో విడిభాగాలు, నగలు మరియు వ్యవసాయ వస్తువులు వంటి రంగాలలో అమెరికాకు భారీ మొత్తంలో వస్తువులను ఎగుమతి చేసే భారతదేశ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థ వైఖరి, మాస్కో నుంచి చమురు, ఆయుధాల కొనుగోలుపై అమెరికా అసంతృప్తి చెంది ఈ నిర్ణయాలకు తొలి అడుగు పడిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Akira Nandan : పవన్ కొడుకు అకీరాతో సినిమా.. స్పందించిన నిర్మాత
