గత వారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బ్రెజిల్ సహా అనేక దేశాలపై 50 శాతం సుంకం విధించాలని ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో బంగారం దిగుమతులపై సస్పెన్స్ నెలకొంది. అదే సమయంలో, బంగారాన్ని సుంకాల యుద్ధం నుంచి దూరంగా ఉంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో బంగారంపై ఎటువంటి సుంకం ఉండదని ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.
Also Read:Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
గత వారం రోజులుగా బంగారంపై సుంకాలు విధిస్తారా లేదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం కూడా బంగారంపై భారీ సుంకం విధించే అవకాశాన్ని వ్యక్తం చేసింది. బంగారంపై 50 శాతం సుంకం విధిస్తారనే పుకార్ల కారణంగా, ధరలు భారీగా పెరిగాయి. అయితే, ట్రంప్ స్వయంగా ఈ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అన్ని పుకార్లకు ముగింపు పలికారు. ట్రంప్ తన పోస్ట్‌లో “బంగారంపై ఎటువంటి సుంకం ఉండదు” అని తెలిపారు.
Also Read:Bandi Sanjay: అసత్యాలు మాట్లాడారంటూ.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసు!
ఇది తప్ప ట్రంప్ మరే ఇతర సమాచారాన్ని పంచుకోలేదు. ట్రంప్ చేసిన ఈ పోస్ట్ తర్వాత, బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో ట్రంప్ భారత్ తో సహా అనేక దేశాలపై 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. భారతదేశం, రష్యా, బ్రెజిల్ వంటి అనేక దేశాలతో ఉద్రిక్తతల మధ్య, ట్రంప్ ఉపశమన వార్తను అందించారు.
