టిక్‌టాక్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా తాజా కామెంట్లు ఉన్నాయి. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్ లాభం పొందుతుందని ట్రంప్ ఆరోపించారు.
యూజర్ల సమాచారం సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు టిక్ టాక్‌పై నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా కూడా దీనిపై చర్యలకు సిద్ధమైంది. కానీ న్యాయపరమైన సమస్యల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు.
తాజాగా మరోసారి దీనిపై చర్చ మొదలైంది. బుధవారం టిక్‌టాక్‌పై నిషేధం విధించే బిల్లును రిపబ్లికన్లు యూఎస్ హౌస్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు మద్దతుగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. దీనిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్ లాభపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
టిక్‌టాక్‌తో మంచీ, చెడు రెండూ ఉన్నాయని. దేశంలో యువత సహా ఎంతోమంది ఆ యాప్‌ను ఇష్టపడుతున్నారని తెలిపారు. దీనిపై నిషేధం విధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ వ్యాపారం రెండితలవుతుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అమెరికన్లకు నిజమైన శత్రువు ఫేస్‌బుక్‌నే తెలిపారు. టిక్‌టాక్ ద్వారా అమెరికన్ల డేటా చైనా సేకరించడం దేశ భద్రతకు ముప్పే అని అభిప్రాయపడ్డారు. కానీ దానిపై నిషేధం విధించి ఫేస్‌బుక్‌ను పెద్దదాన్ని చేయడం మంచిది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
టిక్‌టాక్‌కు అమెరికాలో 150 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దీన్ని చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ యాప్ వద్ద ఉన్న అమెరికన్ల సమాచారం చైనా చేజిక్కించుకునే అవకాశం ఉందని కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బైట్ డ్యాన్స్ సంస్థ టిక్‌టాక్‌ను అమ్మేయాలని అమెరికా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. లేదంటే దానిపై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. బుధవారం దీనిపై ఓటింగ్ జరగనుంది. అయితే టిక్‌టాక్‌కు యువతలో ఉన్న ఆదరణ, గత అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్‌బుక్ జోక్యం చేసుకుందనే ఆరోపణల నేపథ్యంలో సొంత పార్టీ నేతలు ప్రవేశపెట్టబోయే బిల్లును ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.
ఇక టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యాప్‌ను చట్టవిరుద్ధం చేయడం వల్ల కీలకమైన ఎన్నికల సంవత్సరంలో యువ ఓటర్లను ఆపివేయవచ్చు.