H1B Visa Fees: ట్రంప్.. H1B వీసా వార్షిక రుసుమును సడెన్‌గా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 88 లక్షలకుపైనే) పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తరువాత ఇందుకు గల కారణాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అనేక అమెరికన్ కంపెనీలు అమెరికన్ టెక్ కార్మికులను తొలగించి, వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయని వైట్ హౌస్ చెబుతోంది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై అమెరికన్లకే మొదటి హక్కు ఉందని ట్రంప్ పదే పదే పేర్కొన్న విషయం విధితమే.
READ MORE: Gujularamaram : హైదరాబాద్ గజులరామారంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేతలు
అయితే.. వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం.. తాజాగా ఒక కంపెనీ 16,000 మంది అమెరికన్ కార్మికులను తొలగించింది. అదే కంపెనీ 5,189 H-1B అనుమతులను పొందింది. 1,698 వీసా అనుమతులను పొందిన మరో కంపెనీ.. 2,400 ఉద్యోగాలను తగ్గించిందని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. మూడవ కంపెనీ 25,075 H-1B వీసా అనుమతులను పొందింది.. 2022 నుంచి 27,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. అదనంగా, మరో కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరానికి 1,137 H-1B వీసాలు పొంది.. ఫిబ్రవరిలో 1,000 అమెరికన్ ఉద్యోగాలను తగ్గించింది. అమెరికన్ ఐటీ ఉద్యోగులు ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం, విదేశీ టెక్కీలకు శిక్షణ ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
READ MORE: Bhumana Karunakar Reddy : దమ్ము ఉంటే సీబీఐ విచారణ జరిపించండి..తల నరుక్కోవడానికి అయినా నేను సిద్ధం !
