H1B Visa: డోనాల్డ్ ట్రంప్ పేల్చిన H1B వీసా ఫీజు పెంపు బాంబు ప్రభావం మన దేశంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ దుష్ప్రభావం భారతీయ వివాహాలపై కనిపిస్తోంది. వీసా రుసుము $100,000 (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచిన వెంటనే.. అమెరికాలో పనిచేసే NRI వరులకు డిమాండ్ తగ్గింది. ఒక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు తమ పిల్లలకు అంతర్జాతీయ సంబంధాలు చూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ట్రంప్ విధానాల కారణంగా NRIల ఉద్యోగ ప్రమాదం గురించి ఆందోళన చెందుతున్నాయి.
READ MORE: Cough Syrups : ఆ దగ్గు మందులను నిషేధిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
ట్రంప్ వీసా బాంబు భారతదేశానికి దెబ్బగా మారుతోంది.. ఎందుకంటే ఈ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న వారిలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. సంఖ్యలు మారుతూ ఉన్నప్పటికీ.. FY24లో ఆమోదించిన H-1B వీసా లబ్ధిదారులలో 71% మంది భారతీయులేనని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే.. ఈ మార్పుపై కోలాహలం మధ్య, వైట్ హౌస్ ఇటీవల పరిస్థితిని స్పష్టం చేసింది. ఈ వీసా రుసుము ఇప్పటికే ఉన్న వీసాదారులపై వర్తించదని కొత్త దరఖాస్తులపై మాత్రమే విధిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ H1B వీసా ఫీజు నియమం గురించి వైట్ హౌస్ స్పష్టం చేసినప్పటికీ.. భయం కనిపిస్తోంది. ముఖ్యంగా NRI లకు సంబంధాలు చూస్తున్న వారిలో ఈ నిర్ణయం భయాన్ని సృష్టించింది. ఎన్‌ఆర్‌ఐ పౌరుల మధ్య వివాహాలపై అధికారిక ప్రభుత్వ గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ, ట్రంప్ ప్రకటన తర్వాత ఈ మార్పు విస్తృతంగా కనిపించింది. ఎన్‌ఆర్‌ఐ వరుడిని చేసుకోవడంతో ఆర్థిక భద్ర ఉంటుందని తల్లిదండ్రులు భావించే వాళ్లు. కానీ.. ఈ భావన వేగంగా మసకబారుతోంది.
READ MORE: Ponnam and Adluri : అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం
హెచ్-1బీ వార్షిక ఫీజు పెంపు భారం మోయలేనంతగా ఉంటుందని నిపుణులు గతంలో అంచనా వేశారు. అమెరికాలో ఒక మధ్యస్థాయి ఇంజినీర్ సంవత్సరానికి 1,20,000 డాలర్లు సంపాదిస్తే.. అందులో లక్ష డాలర్లు వీసా ఫీజు అంటే.. 80 శాతం జీతం అక్కడే పోతుంది. దీనివల్ల అత్యధిక స్థాయిలో వేతనం పొందేవారు మినహా మిగిలినవారు యూఎస్ వలస వెళ్లడం పెనుభారమే అవుతుంది. అమెరికాలో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత హెచ్-1బీ వీసాలకు మారే కమ్యూనిటీలో కూడా భారతీయులదే ఆధిపత్యం. ఇప్పుడు ఈ పిడుగు లాంటి వార్త వారి కెరీర్ అవకాశాలకు భారీగా గండి కొట్టనుంది.
