Site icon NTV Telugu

Trump Statue: ఇదేందయ్యా ఇది.. బతికి ఉండగానే అమెరికా అధ్యక్షుడికి బంగారు విగ్రహం!

Trump Bitcoin Statue

Trump Bitcoin Statue

Trump Statue: నిత్యం తన నిర్ణయాలతో వార్తలో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరోసారి వార్తల్లో్కి ఎక్కారు. ఇటీవల కాలంలో ట్రంప్ ఆరోగ్యంపై విశేషంగా చర్చ నడిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు రష్యా అధ్యక్షుడితో సమావేశంలో ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే.. ఏంలేదండీ.. ఆయన బతికి ఉండగానే ఆయనకు బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బాబోయ్ ఇదేం పిచ్చి అనుకుంటున్నారా.. ఏం లేదు… ఇంతకీ ఆయన విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Federal Reserve Rate Cut: ఉపాధి ఆందోళనల మధ్య ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత.. ఎంతంటే?

అమెరికా ఫెడరల్‌ రిజర్వు 25 బేసిస్‌ పాయింట్లు మేర వడ్డీ రేట్ల కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసు కదా.. ఇదే సమయంలో అమెరికా క్యాపిటల్‌ భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజా ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాతో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 12 అడుగులు ఉన్న ఈ విగ్రహాన్ని ట్రంప్‌ బిట్‌కాయిన్‌ను పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహం ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు సమాచారం. డిజిటల్‌ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్‌లో ఫెడరల్‌ ప్రభుత్వ విధానాల గురించి చర్చించుకునేలా చేసేందుకే ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారని పలు కథనాలు వస్తున్నాయి. తెలుసు కదా.. ఏ విషయంలోనైనా రెండు రకాలుగా స్పందనలు వస్తాయని.. అదే విధంగా ఈ ట్రంప్ విగ్రహంపై కూడా సోషల్ మీడియా వేదిక కొంతమంది సానుకూలంగా స్పందించగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఏడాది తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు 25 బేసిస్‌ పాయింట్లు మేర వడ్డీ కోత విధించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ మందగిస్తున్న కార్మిక మార్కెట్‌కు ఊతం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫెడ్‌ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో మరో రెండుసార్లు వడ్డీరేట్ల కోత ఉండవచ్చని సూచనప్రాయంగా హింట్ ఇచ్చారు.

READ ALSO: MiG-21 Retirement: శత్రు గుండెల్లో పరుగులు పెట్టిన యుద్ధ విమానం.. 62 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు..

Exit mobile version