హిట్ అండ్ రన్ చట్టం కింద శిక్షా కాలాన్ని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసనలు చేపట్టారు. కొత్త చట్టం ప్రకారం.. డ్రైవర్లు ప్రమాదం చేసి పారిపోయినందుకు, ప్రాణాంతక ప్రమాదాన్ని నివేదించకపోతే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇంతకుముందు.. IPC సెక్షన్ 304A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), నిందితుడికి రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష ఉండేది. అయితే.. శిక్షా కాలాన్ని పెంచాలని కోరుతూ హర్యానాలోని జింద్‌లో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈరోజు సమ్మెకు దిగగా, ఆటో డ్రైవర్లు కూడా కొత్త చట్టానికి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్‌ను తెరిచారు.
Read Also: Tragedy: కొత్త సంవత్సరం వేళ విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య
రోడ్డు ప్రమాదాలపై ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర కపూర్ కొత్త చట్టం గురించి మాట్లాడుతూ.. ఇది తుగ్లక్ చర్య అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము డ్రైవర్ డ్యూటీ కన్నా.. కూలీపనులు చేసుకోవడం మంచిదని డ్రైవర్లంతా పనులు వదిలేస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదం చేసిన డ్రైవర్ కు 10 సంవత్సరాల శిక్ష ఉంటుంది.. అంతేకాకుండా రూ. 7 లక్షలు చెల్లించాలి. డ్రైవర్‌కు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందని రాజేంద్ర కపూర్ ప్రశ్నించారు.
Read Also: Kesineni Nani: నేను విజయవాడ పార్లమెంట్‌కు కాపలా కుక్కను.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. రేపు (జనవరి 2)న ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ముఖ్య అధికారులందరూ వర్చువల్ మీటింగ్‌ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా.. ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ట్రక్కు డ్రైవర్లు నిన్న NH-2లో నిరసన చేపట్టారు.