NTV Telugu Site icon

Bihar Accident: విషాదం.. పెళ్లి కారుపై పడ్డ ట్రక్కు.. ఆరుగురి మృతి

Aeed

Aeed

బీహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భాగల్‌పూర్‌లో ట్రక్కు టైర్ పేలి.. కారుపై బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందారు. ఘోఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమాపూర్ గ్రామ సమీపంలోని 80వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ముంగేర్ నుంచి కహల్‌గావ్‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. పెళ్లి కారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరగగానే సమీపంలో ఉన్న స్థానికులు.. సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Modi Name in Wedding Card: పెళ్లి పత్రికపై మోడీ ఫోటో.. ఇరకాటంలో వరుడు..

మరోవైపు ఒకేసారి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణం బంధువుల రోదనతో మిన్నింటాయి. మరోవైపు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.