Site icon NTV Telugu

Women Commission : ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోండి.. టీఆర్‌ఎస్ మహిళా నాయకులు

Women Commission

Women Commission

బీజేపీ ఎంపీ అర్వింద్‌ నిన్న తన ఇంటిపై దాడి జరిగి నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే.. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలు చేయడంపై టీఆర్‌ఎస్‌ మహిళ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఎంపీ అరవింద్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. మహిళా కమిషన్‌, పోలీసులకు టీఆర్‌ఎస్ మహిళా నాయకుల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇకపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకులు మహిళా కమిషన్‌కు, బంజారాహిల్స్​‍ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునితా లకా్ష్మారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Also Read : Facebook Cheating: కొంపముంచిన ఫేస్‌బుక్ రిక్వెస్ట్.. 39 లక్షలు స్వాహా!
మహిళ పట్ల అసభ్యంతగా, అభ్యంతర కరంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించి మాట్లాడారని టీఆర్‌ఎస్ మహిళా నాయకులు ముక్తవరం సుశీలా రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిటి సివిల్‌ కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను దిక్కరించి అసభ్యంగా, అభ్యంతరంగా, అవమానించే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు. భవిష్యత్‌లో తప్పుడు వ్యాఖ్యలు చేస్తే టీఆర్‌ఎస్ మహిళా నాయకులు ఉరుకొరని వారు హెచ్చరించారు. చట్ట పరంగా పోలీసులు, మహిళా కమిషన్‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో సుశీలారెడ్డితో పాటుగా మహిళా నాయకురాళ్లు లీలా , సువర్ణా రెడ్డి, గీతా గౌడ్‌, ఉమావతి, ప్రభా రెడ్డి, సుజాతా గౌడ్‌, ప్రీతి రెడ్డి, పద్మ ఉన్నారు.

Exit mobile version